ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 125 ఏళ్లుగా | World Loneliest Tree Campbell Island In New Zeland | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 125 ఏళ్లుగా

Published Sun, Oct 9 2022 11:58 AM | Last Updated on Sun, Oct 9 2022 1:04 PM

World Loneliest Tree Campbell Island In New Zeland - Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం. న్యూజిలాండ్‌కు దక్షిణాన దాదాపు 640 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాంప్‌బెల్‌ దీవిలో ఉందిది. ఈ చిన్నదీవిలో విచిత్ర వాతావరణం ఉంటుంది. ఈ దీవిలో ఏడాదికి 325 రోజులు వర్షం కురుస్తూనే ఉంటుంది. ఏడాదిలో చాలారోజులు రోజులో గంట సేపు మాత్రమే సూర్యుడు కనిపిస్తుంటాడు.

ఇక్కడ ఏడాదిలో ఎక్కువ రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రత దాదాపు 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతూ ఉంటుంది. ఈ దీవిలో కొన్నేళ్ల కిందట నాటిన ‘సిట్కా స్ప్రస్‌’ వృక్షం 120 ఏళ్లుగా ఈ దీవిలో ఒంటరిగానే ఉంది. ఈ దీవిలో ఎటుచూసినా గడ్డి, చిన్నా చితకా మొక్కలు తప్ప మరో భారీ వృక్షమేదీ కనిపించదు. ఈ వృక్షానికి ఒక అరుదైన విశేషం కూడా ఉంది.

దీనికి చేరువలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ భూభాగాల నుంచి, వాటికి దక్షిణాన ఉన్న సముద్రం నుంచి వెలువడే కర్బన ఉద్గారాల్లో పది శాతం ఉద్గారాలను ఈ ఒక్క వృక్షమే పీల్చేసుకుంటుంది. భూతాపం వల్ల తలెత్తుతున్న వాతావరణ మార్పులను కట్టడి చేయడంలో ఈ వృక్షం కీలకంగా ఉపయోగపడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

చదవండి: 1938 నుంచి తవ్వకాలు.. ఎట్టకేలకు బయటికి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement