
బ్రుటిగామ్‌సీష్ డోడార్ ఫోర్ట్స్ 23701 యూటిన్, జర్మనీ ..ఇదెవరి అడ్రస్ అనుకుంటున్నారా.. జర్మనీలోని ఓ చెట్టు అడ్రస్. జర్మనీలో చెట్టుకు కూడా అడ్రస్ ఉంటుందా అని ఆశ్చర్యపడకండి. అయితే ఆ ఒక్క చెట్టుకే అడ్రస్ ఉంది. ఇదో వోక్ చెట్టు. దీనికి వయసు దాదాపు 500 సంవత్సరాలు. అయితే ఏంటంటారా.. ఈ చెట్టుకు ఉత్తరం రాస్తే అబ్బాయిలకు పెళ్లవుతుందట. అందుకే దీనికి ‘పెళ్లి కుమారుడి’ చెట్టు అని పిలుస్తారు.
ఆ ఉత్తరం చివరికి ఆ చెట్టుకు ఉన్న తొర్రలోకి వెళ్తుంది. ఆ తర్వాత కోరుకున్న అమ్మాయితో పెళ్లవుతుందని అక్కడి వారి నమ్మకం. నమ్మకమే కాదు అలా ఉత్తరాలు రాసిన వందలాది మందికి వారు కోరుకున్నట్లుగానే పెళ్లయిందట. ఓర్ట్ అనే అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్ ఫెల్షీకి చేరవేసేందుకు ఓ ఉత్తరాన్ని ఈ చెట్టు తొర్రలో వేసిందట. దీంతో వారిద్దరికీ 1891 జూన్ 2న పెళ్లయిందట. అప్పటి నుంచి ఆ నమ్మకం కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment