పగులగొట్టి తొలగించిన ఊరచెరువు మత్తడి , అస్తవ్యస్తంగా ఉన్న కాలువ
కాసిపేట: ప్రభుత్వం మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేసి రైతులను, గ్రామాలను పచ్చగా ఉంచుతామని చేపట్టిన చెరువు మరమ్మతులు కాసిపేట మండలంలో మాత్రం రైతులకు శాపం గా మారాయి. మిషన్ కాకతీయ పేరుతో కంట్రాక్టర్ అవతారమెత్తి చెరువు మరమ్మతులు పనులు చేపట్టినా.. అధికార పార్టీ నాయకులు మత్తడిని పూర్తిగా తొలగించడంతో చెరువులో చుక్కనీరు లేకుండా పోయింది. ఇదే అదునుగా భావించి గతంలో చెరువులో మా భూములను కోల్పోయామని కబ్జాలకు పాల్పడుతున్నారు.
దీంతో చెరువు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. మండలంలోని పల్లంగూడ గ్రామశివారు ఊరచెరువు అభివృద్ధి పనులకు 2016లో టెండర్లు పిలిచి రూ. 25లక్షలు నిధులు కేటాయించారు. టెండర్లు దక్కించుకున్న కంట్రాక్టర్‌ను బెదిరించి అధికార పార్టీ నాయకులు చెరువుల పనులు చేయడం సర్వసాధారణంగా మారింది. మిషన్‌కాకతీయతో చెరువులు వినియోగంలోకి రావడం మాట పక్కన పెడితే ఊరచెరువు విషయంలో మాత్రం నాయకుల తీరు రైతులకు శాపంగా మారుతోంది. దీంతో మూడేళ్లుగా పోలా లు బీడులుగానే ఉంటున్నాయి. టెండరు వచ్చిన కంట్రాక్టర్ నుంచి పనులు తీసుకున్న మండల నాయకులు మరమ్మతుల పేరుతో మొదట చెరు వు మత్తడిని పూర్తిగా తొలగించి, పనులు చేపట్టకపోవడంతో చెరువులో చుక్కనీరు లేకుండా పో యింది.
దీంతో చెరువుపై సుదీర్ఘకాలంగా ఆధారపడి పోలాలు చేసుకుంటున్న రైతులు మూడేళ్లుగా భూములను బీడులుగా వదులుతున్నారు. ఈ వి షయమై రైతులు అధికార పార్టీ నాయకులు, ఎ మ్మెల్యే, అధికారులను కలిసి పలుమార్లు విన్న వించినా.. ప్రయోజనం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మిషన్ కాకతీయతో ఉన్న చెరువు అనవాలు లేకుండా పోయిందని రైతులు నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి నిర్వా కంతో ప్రస్తుతం చెరువుకబ్జా అవుతుందని నాయకులు, అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నా యి. వెంటనే చెరువు సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
నీరు లేకపోవడంతో చెరువు కబ్జా..
60 ఏళ్ల క్రితం నిర్మించిన చెరువులో మరమ్మతులు లేకున్న ప్రతి ఏడాది ఆయకట్టు కింద కనీసం 50 ఎకరాలు వరి పంట సాగు అయ్యేది. మత్తడి తొలగించి తూములు తీసి ఉంచడంతో చెరువులో చుక్కనీరు లేకుండా అయింది. చెరువులో పోయిన తన భూమికి పరిహారం ఇవ్వలేదంటూ ప్రస్తుతం చెరువు భూమిని కబ్జా చేసి సాగు చేసుకుంటున్నా రు. సంబంధిత రైతులు మిషన్‌కాకతీయ పనులు అడ్డుకుంటున్నట్లు తెలిపి పనులు నిలిపివేసిన వా రు ప్రత్యమ్నాయ మార్గాలు చూడలేదు.
60 ఏళ్ల క్రితం నుంచి ఉన్న చెరువు విషయంలో భూమి విషయం మాట్లాడకుండా ప్రస్తుతం నీరు లేకపోవడంతో కబ్జాకు దిగడంతో సంబంధిత నాయకులు కబ్జాను ప్రోత్సహించేందుకే అధికారికంగా మరమ్మతుల పేరుతో మత్తడి కూల్చివేశారని రై తులు ఆరోపిస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించి చెరువును అభివృద్ధిలోకి తీసుకురావా లని పలువురు కోరుతున్నారు. చెరువు మీద ఆధారపడిన రైతు కుటుంబాలకు అన్యాయం చేయడం సరికాదని అవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment