Mandamarry
-
మంచిర్యాల: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్
-
మంచిర్యాల: నా వాహనాన్నే ఆపుతారా? టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి!
సాక్షి, మంచిర్యాల: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్ చేశారు. తన వాహనానికి రూట్ క్లియర్ చేయలేదంటూ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా దాడి చేయటం సరికాదంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. టోల్‌ప్లాజా వద్దకు వచ్చిన క్రమంలో తనకు రూట్ క్లియర్ చేయలేదంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దౌర్జన్యానికి దిగారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యేపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం కూడా చేస్తామని హెచ్చరించారు. ఇదీ చదవండి: అసైన్డ్ భూములపై కేసీఆర్ సర్కార్ స్పెషల్ ఫోకస్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు! -
సింరేణి కార్మికుని దారుణ హత్య
మందమర్రి : మందమర్రి ప్రాణహిత కాలనీకి చెందిన ఆర్కే-1ఏ బొగ్గుగని సింగరేణి కార్మికుడు భీమ్రావు(50)ను బుధవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హతమార్చారు. భీమ్రావు ఇంటి నుంచి విధులకు వెళుతుండగా మార్గమధ్యంలో ఉదయం 6 గంటలకు కాపు కాసిన దుండగులు అతనిని అడ్డగించి గొంతు కోసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'దళిత సీఎం హామీని మరచిన కేసీఆర్'
మందమర్రి (ఆదిలాబాద్) : దళితులను తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న సీఎం కేసీఆర్ ఆ హామీని విస్మరించారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత జి.వివేక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఆదివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగరేణి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రథమ మహాసభలలో పాల్గొన్న సందర్భంగా వివేక్ మాట్లాడారు. కుటుంబ పాలనే తప్ప ముఖ్యమంత్రికి ప్రజల కష్టాలు పట్టవన్నారు. ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఫ్యాక్టరీలను మూసి ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నారని ఆరోపించారు. కాగా నాయకుడి కంటే కార్మికుడే తెలివైనవాడని ఐఎన్టీయూసీ అఖిల భారత అధ్యక్షుడు సంజీవరెడ్డి అన్నారు. కార్మికుడి కష్టాలు తీర్చకుండా ఓటు అడిగే హక్కు ఏ నాయకుడికీ లేదన్నారు. ఐఎన్టీయూసీ ఎప్పుడూ కాంగ్రెస్‌కు అనుబంధంగానే కొనసాగుతుందని చెప్పారు.