సాక్షి, మంచిర్యాలక్రైం: ఒక్కటి కాదు.. రెండు కాదు.. సుమారు 250 కిలోమీటర్లు.. 29స్టేషన్లు.. ఆరు జిల్లాలు. వీటన్నిటికీ కలిపే ఒక్కటే పోలీస్‌స్టేషన్.. ఒకే ఒక్క ఎస్సై. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా..!!
మంచిర్యాల రైల్వే పోలీస్‌స్టేషన్ (జీఆర్పీ) పరిధిలో ఆరు జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 29 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ పరిధి సుమారు 250 కిలోమీటర్లు. మరోవైపు సిబ్బంది కొరత. ఇన్ని సమస్యల మధ్య రైల్వేస్టేషన్ విధులు కొనసాగిస్తోంది. ఎక్కడైనా ఎనిమిది గంటలు విధులు ఉంటే ఇక్కడి సిబ్బంది మాత్రం ఏకంగా 12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. సికింద్రాబాద్ మొదలు కాజీపేట వరకు ఉన్న జీఆర్పీ పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఎనిమిది గంటలే పనిచేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పనిష్‌మెంట్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు.
సిబ్బంది లేమితో పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా రైలుమార్గం మీదుగా అక్రమంగా సరుకులు రవాణా అవుతున్నాయి. దొంగతనాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఉప్పల్ రైల్వేస్టేషన్ మొదలు.. సిర్పూర్ టౌన్ స్టేçషన్ వరకు.. ఇటు పెద్దపల్లి నుంచి జగిత్యాల వరకు ఒక్కరే ఎస్సై విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందినవారు ఉప్పల్ మొదలు సిర్పూర్‌టౌన్, పెద్దపల్లి నుంచి జగిత్యాల రైల్వేస్టేషన్ల మధ్య ఎలాంటి ప్రమాదాలు సంభవించినా.. ఏదైనా సంఘటన చోటుచేసుకున్నా సమాచారం కోసం మంచిర్యాల రైల్వే పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది.
సివిల్ పోలీస్‌ల సౌకర్యాలు ఇలా...
సాధారణంగా మండలానికో పోలీస్‌స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ పరిధి సుమారు 25 నుంచి 30కిలోవీుటర్లు. ఎస్సై, ఒకరు లేదా ఇద్దరు ఏస్సైలు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 10 మంది కానిస్టేబుళ్లు, నలుగురు హోమ్‌గార్డులు ఉంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా.. ఎస్సైకి వాహనం, సిబ్బందికి ద్విచక్రవానాలను ప్రభుత్వ సమకూర్చింది.
అదే రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న జీఆర్‌పీ (గవర్నమెంట్ రైల్వేపోలీస్) పోలీసులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలూ లేవు. పైగా సివిల్ పోలీస్ స్టేషన్లో కంటే కేసులు ఎక్కువగానే నమోదు అవుతుంటాయి. దూరభారం ఎక్కువగానే ఉంటుంది. కనీసం ఎస్సై స్థాయి అధికారికీ వాహన సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
గుర్తుతెయని మృతదేహాలతో ఇబ్బంది
రైలు ప్రమాదాలోŠల్ గుర్తుతెలియని మృతదేహాలు ఎక్కడోచోట కన్పిసూ్తనే ఉంటాయి. ఇలా ఏటా 50మంది వరకు చనిపోతారు. వీటిని ఆసుçపత్రికి తరలించేందుకు.. దహన సంస్కారాలు చేసేందుకు ఒక్కో శవానికి సుమారు రూ.3వేల వరకు ఖర్చవుతుంది. అన్ని పనులూ రైల్వే సిబ్బంది చేయాల్సిందే.\
రైల్వే (జీఆర్పీ) పోలీసుల పరిస్థితి ఇలా..
కాజీపేట నుంచి మహారాష్ట్ర వరకున్న రైలుమార్గంలో మంచిర్యాలలో మాత్రమే రైల్వేస్టేషన్ ఉంది. ఈ స్టేషన్ పరిధిలో ఓ ఎస్సై, ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 41 మంది కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 47 మంది. దీని పరిధిలో మూడు ఔట్ పోస్టులున్నాయి. రామగుండం, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ స్టేçషన్ల వద్ద ఏర్పాటు చేసిన ఔట్ పోస్టుల్లో ముగ్గురు హెడ్‌కానిస్టేబుళ్లు పని చేయాల్సి ఉండగా.. ఇద్దరే ఉన్నారు. ఈ మార్గంలో వెళ్తున్న రైళ్లలో దొంగతనాలు, ప్రమాదాలు, ఆత్మహత్యలు, కిడ్నాప్‌లు, అక్రమ రవాణా జోరుగా సాగుతుంది.
నిత్యం సుమారు 5నుంచి 10 వరకు కేసులు నమోదవుతాయి. 29స్టేషన్ల పరిధిలో 250 కిలోమీటర్ల మధ్య ఏ ప్రమాదం జరిగినా.. దొంగతనం జరిగినా మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు రావాలి్సందే. సంఘటన జరిగిన స్థలానికి రైల్వేపోలీసులు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉప్పల్, సిర్పూర్ టౌన్ వంటి అటవి ప్రాంతాల్లో ఎవరైనా ప్రమాదానికి గురైనా.. ఆత్మహత్య చేసుకున్నా.. మృతదేహాలను పరిశీలించేందుకు వెళ్లాలంటే రైల్వే సిబ్బందికి నరకం కనిపిస్తోంది.
సంఘటన జరిగిందని కూడా ఇతర శాఖల అధికారులు కనీసం సమాచారం ఇవ్వరని సిబ్బంది వాపోతున్నారు. గుర్తు తెలియని వారు ప్రమాదానికి గురై చనిపోతే.. మృతదేహాలను తరలించేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న కేసుకు రూ.వె య్యి ఎటూ సరిపోవడం లేదంటున్నారు.
ఇబ్బంది పడుతున్న ఆరు జిల్లాల ప్రజలు
రైల్వే కేసులపై ఏ అవసరం వచ్చినా.. మంచిర్యాలకు రావాలి్సందే. ఉప్పల్ రైల్వేస్టేషన్ మొదలు సిర్పూర్‌టౌన్ వరకు, పెద్దపల్లి నుంచి జగిత్యాల వరకు ఉన్న రైలు ట్రాక్‌పైగానీ.. రైల్లో ఏ ప్రమాదం జరిగినా.. ఫిర్యాదు చేసేందుకు మంచిర్యాలకు రావాలి్సందే. దీంతో ఆరు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతోదూరం నుంచి ప్రయాసపడి వస్తే కొన్ని సందర్భాల్లో అధికారులు కలవకపోవడంతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.
అరకొర సిబ్బంది
ఆరు జిల్లాల మీదుగా వెళ్తున్న రైలుమార్గంలో 29 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఇన్ని స్టేషన్లలో 80 మంది సిబ్బంది పని చేయాల్సి ఉంటుంది. కానీ.. 47మంది మాత్రమే పని చేస్తున్నారు. కాగజ్‌నగర్, బెల్లంపెల్లి, స్టేషన్లకు ఎస్సై పోస్టు మంజూరు ఉన్నప్పటికీ ఇప్పటికీ భర్తీకాలేదు. మంచిర్యాల జీఆర్పీ పోలీస్‌స్టేషన్ ఎస్సై ఒక్కరే పర్యవేక్షణ చేయాల్సి వస్తోంది. సిబ్బంది కొరతతో ఎనిమిది గంటలు పనిచేయాల్సి ఉండగా.. 12 గంటలు చే యాల్సి వస్తోంది. ఫలితంగా సిబ్బంది అ నారోగ్యాల పాలవుతున్నామని సిబ్బంది వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment