మండలంలోని రేచినిరోడ్ రైల్వేస్టేషన్‌లో తాండూర్ రెవెన్యూ, పోలీసులు అధికారులు బుధవారం సంయుక్తంగా దాడులు నిర్వహించి 49.80 క్వింటాళ్ల బియ్యం రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నిత్యం రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. రామగిరి రైలు వచ్చి స్టేషన్‌లో ఆగిన వెంటనే దాడి చేశారు. అప్పటికే రేషన్ బియ్యం రైల్లో ఎక్కించడం, మరికొన్ని సంచులు ప్లాట్‌ఫాంపై ఉండడంతో సిబ్బంది రైల్లో ఉన్న బియ్యం సంచులను కిందికి దించారు. బియ్యాన్ని తరలించే వ్యక్తులు పారిపోయూరు. 164 సంచుల్లో 49.80 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. వీటిని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించారు. దాడుల్లో తహశీల్దార్ రామచంద్రయ్య, తాండూర్ ఎస్సై అశోక్‌కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెప్యూటీ తహసీల్దార్లు మునీర్, రియాజ్, వీఆర్వోలు, వీఆర్‌ఏలు, సిబ్బంది పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్‌లో రేషన్ బియ్యం పట్టివేత
Published Wed, Aug 17 2016 6:48 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
Advertisement