తిరుపతి రైల్వే స్టేషన్‌లో భద్రతపై నిఘా వ్యవస్థ నిద్రపోతోంది. నిత్యం తిరుమల శ్రీవారి దర్శనార్థం రైళ్లలో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్లాట్ ఫారాలపై ఎక్కడ చూసినా యాచకులు, అనామకులు తిరుగుతున్నా రైల్వే పోలీసు విభాగాల సిబ్బంది జాడ కనిపించడం లేదు. తరచూ ప్రయాణికులపై కొందరు వీరంగం చేస్తున్నా పట్టించుకునేవారే లేరు.
- యథేచ్ఛగా అనామకుల సంచారం
- జోగుతున్న రైల్వే పోలీసు సిబ్బంది
- కోల్‌కతా ఘటనతోనైనా అప్రమత్తమవుతారా..?
తిరుపతి అర్బన్: భద్రతపై కేంద్ర నిఘా సంస్థలు, ఇంటెలిజెన్స్ పదేపదే హెచ్చరికలు చేస్తున్నా రైల్వే పోలీసు విభాగాల సిబ్బంది నిర్లక్ష్యం వీడం లేదు. కోల్‌కత్తా రైల్వేస్టేషన్ శివారులోని జనరల్ రైలులో రెండ్రోజుల క్రితం బాంబు పేలి అనేక మంది ప్రయాణికులు గాయాలపాలైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతోనైనా తిరుపతి రైల్వే పోలీసులు అప్రమత్తమవుతారా...? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్ ఆవరణాల్లో ఎక్కడ చూసినా యాచకుల వేషధారులు, అనామకు లు దర్శనమిస్తూ ప్రయాణికులను ఇ బ్బందులకు గురిచేస్తున్నారు. వీరి ముసుగులో కొందరు వీరంగం చేసి ప్రయాణికుల నుంచి దొరికిన మేరకు దోచుకుని అత్యంత తెలివిగా జారుకుంటున్నారు.
తిరుపతిలో వారం రోజుల పాటు పెద్ద ఎత్తున జరిగిన గంగజాతర నేపథ్యంలో రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారాలపై అనామకుల సంచారం యథేచ్ఛగా సాగింది. జాతరలు, పండుగల సందర్భాల్లోనే రైల్వేస్టేషన్ భద్రతపై పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారంటే...సాధారణ రోజుల్లో తని ఖీలకు అతీగతీ ఉండదు. ప్రధానంగా రైల్వేస్టేషన్‌లో జనసంచారం లేని 4, 5 ప్లాట్‌ఫారాలపై యాచకుల వేషాల్లోని వ్యక్తులు శాశ్వతంగా తిష్టవేసి ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్న సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ నియంత్రణ చర్యలు లేవు. ప్లాట్‌ఫారాలే కాకుండా దక్షిణం వైపు రిజర్వేషన్ కార్యాలయానికి వెళ్లే ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్ల కింద కూడా అనామకుల స్థావరాలు కనబడుతాయి.
వీరు ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్లాట్‌ఫారాలపైకి చేరుకుని ప్రయాణికుల నుంచి నగలు, నగదు, వస్తువుల బ్యాగులు దో పిడీ చేస్తున్నారు. రైల్వేస్టేషన్ పరిధిలో దొంగతనాలపై జీఆర్పీ పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం. సాయంత్రం వేళల్లో ఏకంగా రై ల్వే వెయిటింగ్ హాళ్లలో, మొదటి ప్లాట్‌ఫారంపై ఈ అనామకుల సంచారం ఎ క్కువగా ఉంటున్నా రైల్వే పోలీసులు పట్టించుకోవడం లేదు. రైల్వే రెండు విభాగాల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయాల్సి అవసరం ఎంతైనా ఉంది.
రైల్వే స్టేషన్‌లో భద్రత కరువు
Published Fri, May 15 2015 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM
Advertisement
Advertisement