The Central Intelligence Agency
-
హై అలర్ట్
ఐబీ హెచ్చరికలతో పోలీసుల అప్రమత్తం సీఆర్డీఏ పరిధిలో నిఘా మరింత పటిష్టం కీలక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం విజయవాడ సిటీ : ‘ఉగ్రమూకలు ఏ రూపంలోనైనా రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. నిఘాను పటిష్టం చేసి కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయండి’ అంటూ కేంద్ర నిఘా సంస్థ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కమిషనరేట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిఘాను పటిష్టం చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో గస్తీని పెంచారు. ఇటీవల చోటుచేసుకుంటున్న ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రధాన పట్టణాల్లోని పోలీసులను అప్రమత్తం చేస్తూ కేంద్ర నిఘా సంస్థ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులను పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ అలర్ట్ చేస్తూ ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు విదేశీ ప్రతినిధులు బస చేసిన ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. సీఎం క్యాంప్ ఆఫీసులోకి పూర్తి తనిఖీల తర్వాతనే పంపుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో.. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పోలీసు పహారాను పెంచారు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ వద్ద గస్తీని ముమ్మరం చేశారు. ఏఏ ప్రాంతాల్లో జనావాసాలు రద్దీగా ఉంటాయనేది గుర్తించి ఆయా చోట్ల సాయుధ పోలీసులతో పహారా నిర్వహిస్తున్నారు. ప్రజలు అధికంగా సందర్శించే బీసెంట్‌రోడ్డు, రాజీవ్‌గాంధీ పార్కు, బెంజిసర్కిల్ ప్రాంతాల్లో మరింత అప్రమత్తమయ్యారు. షాపింగ్ మాల్స్ సహా ప్రైవేటు సంస్థల్లో సీసీ కెమెరాలను వినియోగంలోకి తేవాలంటూ యజమానులకు సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు జరుపుతున్నారు. తగిన రశీదులు లేని వాహనాలను సీజ్ చేయాలంటూ పోలీసు అధికారులు దిగువ స్థాయి అధికారులకు సూచిస్తున్నారు. ప్రయాణ ప్రాంగణాల్లోనూ.. ప్రయాణికులు ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, పండిట్ నెహ్రూ బస్స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ఒక్కరి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు వివిధ విభాగాలకు చెందిన నిఘా సిబ్బందిని మోహరించారు. ప్రయాణికులెవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే అదుపులోకి తీసుకుని పూర్తి విచారణ తర్వాతనే వదలాలంటూ పోలీసు అధికారులకు ఉన్నత స్థాయి ఆదేశాలు అందాయి. దుర్గగుడిపై.. రాష్ట్రంలోని రెండో అతిపెద్ద దేవాలయమైన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భద్రతను పెంచారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే వ్యక్తుల కదలికలు గమనించేందుకు షాడో పార్టీలను నియమించారు. భక్తుల ముసుగులో అసాంఘికశక్తుల రాకను నిలువరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. గుంటూరు నగరంపై డేగకన్ను.. గుంటూరు : నూతన రాజధాని నిర్మాణం జరుగనున్న గుంటూరులో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా జిల్లా పోలీసులను డీజీపీ కార్యాలయం అప్రమత్తం చేసింది. ఉగ్రజాడపై నిఘా ఉంచాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. దీనికి తోడు కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు సైతం గుంటూరు నగరంపై డేగకన్ను వేశారు. మూడు నెలల క్రితం సెమి ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు నిర్వహించిన సంఘటనకు సంబంధించి వారి మూలాలు గుంటూరు, విజయవాడలో ఉంటాయని వార్తలు వినరావడంతోఅప్పట్లో పోలీసులు పూర్తి స్థాయిలో నిఘాను పటిష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో నిత్యం విదేశీ ప్రతినిధులు పర్యటిస్తున్న నేపథ్యంలో తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో ఇంటిలిజెన్స్ పోలీసులు కొత్త వ్యక్తుల కదలికలపై ఆరా తీస్తున్నారు. -
రైల్వే స్టేషన్లో భద్రత కరువు
తిరుపతి రైల్వే స్టేషన్లో భద్రతపై నిఘా వ్యవస్థ నిద్రపోతోంది. నిత్యం తిరుమల శ్రీవారి దర్శనార్థం రైళ్లలో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్లాట్ ఫారాలపై ఎక్కడ చూసినా యాచకులు, అనామకులు తిరుగుతున్నా రైల్వే పోలీసు విభాగాల సిబ్బంది జాడ కనిపించడం లేదు. తరచూ ప్రయాణికులపై కొందరు వీరంగం చేస్తున్నా పట్టించుకునేవారే లేరు. - యథేచ్ఛగా అనామకుల సంచారం - జోగుతున్న రైల్వే పోలీసు సిబ్బంది - కోల్‌కతా ఘటనతోనైనా అప్రమత్తమవుతారా..? తిరుపతి అర్బన్: భద్రతపై కేంద్ర నిఘా సంస్థలు, ఇంటెలిజెన్స్ పదేపదే హెచ్చరికలు చేస్తున్నా రైల్వే పోలీసు విభాగాల సిబ్బంది నిర్లక్ష్యం వీడం లేదు. కోల్కత్తా రైల్వేస్టేషన్ శివారులోని జనరల్ రైలులో రెండ్రోజుల క్రితం బాంబు పేలి అనేక మంది ప్రయాణికులు గాయాలపాలైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతోనైనా తిరుపతి రైల్వే పోలీసులు అప్రమత్తమవుతారా...? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్ ఆవరణాల్లో ఎక్కడ చూసినా యాచకుల వేషధారులు, అనామకు లు దర్శనమిస్తూ ప్రయాణికులను ఇ బ్బందులకు గురిచేస్తున్నారు. వీరి ముసుగులో కొందరు వీరంగం చేసి ప్రయాణికుల నుంచి దొరికిన మేరకు దోచుకుని అత్యంత తెలివిగా జారుకుంటున్నారు. తిరుపతిలో వారం రోజుల పాటు పెద్ద ఎత్తున జరిగిన గంగజాతర నేపథ్యంలో రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారాలపై అనామకుల సంచారం యథేచ్ఛగా సాగింది. జాతరలు, పండుగల సందర్భాల్లోనే రైల్వేస్టేషన్ భద్రతపై పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారంటే...సాధారణ రోజుల్లో తని ఖీలకు అతీగతీ ఉండదు. ప్రధానంగా రైల్వేస్టేషన్లో జనసంచారం లేని 4, 5 ప్లాట్‌ఫారాలపై యాచకుల వేషాల్లోని వ్యక్తులు శాశ్వతంగా తిష్టవేసి ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్న సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ నియంత్రణ చర్యలు లేవు. ప్లాట్‌ఫారాలే కాకుండా దక్షిణం వైపు రిజర్వేషన్ కార్యాలయానికి వెళ్లే ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్ల కింద కూడా అనామకుల స్థావరాలు కనబడుతాయి. వీరు ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్లాట్‌ఫారాలపైకి చేరుకుని ప్రయాణికుల నుంచి నగలు, నగదు, వస్తువుల బ్యాగులు దో పిడీ చేస్తున్నారు. రైల్వేస్టేషన్ పరిధిలో దొంగతనాలపై జీఆర్పీ పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం. సాయంత్రం వేళల్లో ఏకంగా రై ల్వే వెయిటింగ్ హాళ్లలో, మొదటి ప్లాట్‌ఫారంపై ఈ అనామకుల సంచారం ఎ క్కువగా ఉంటున్నా రైల్వే పోలీసులు పట్టించుకోవడం లేదు. రైల్వే రెండు విభాగాల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయాల్సి అవసరం ఎంతైనా ఉంది. -
శివార్లలో ‘టై’ అలర్ట్
అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు ఐటీ కేంద్రాలు, విమానాశ్రయంపై నిఘా వాహన తనిఖీలు ముమ్మరం సిటీబ్యూరో: ‘నగర శివార్లలో ఉగ్రవాదులు విరుచుకుపడొచ్చు’ అని కేంద్ర నిఘా సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఉన్న మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, ైెహ టెక్ సిటీ, మేడిపల్లి, ఆదిబట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రత పెంచడంతో పాటు ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో అక్టోపస్ కమాండోలను మోహరించారు. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో వాహన తనిఖీలు, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్ని ఠాణాల ఇన్స్పెక్టర్లకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, కాలనీల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మైత్రీ కమిటీ సభ్యులకు ఇన్స్పెక్టర్లు సూచించారు. జంట పోలీసు కమిషనరేట్లలో ఇటీవల ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) కార్యకలాపాలు తెరపైకి రావడంతోనే కేంద్ర నగర పోలీసులను అప్రమత్తం చేసిందని తెలుస్తోంది. ఇక దేశంలోని విమానాశ్రయాల్లో ఏదో ఒక విమానాన్ని హైజాక్ చేయాలని ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని హెచ్చరికలు రావడంతో కూడా పోలీసులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై రాత్రి వేళ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో సైబరాబాద్‌లో ఉగ్రవాదులు పట్టుబడిన ఉదంతాల నేపథ్యంలో శివార్లలో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఇక్కడ ఉగ్రవాదులకు కలిసొచ్చే అంశాలివీ... శివార్లలో ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచి, కౌంట ర్ ఇంటెలిజెన్స్ అధికారుల నిఘా తక్కువ ఉండటం. ఆయా పోలీసు స్టేషన్ల విస్తీర్ణం ఎక్కువ కావడంతో పోలీసు పెట్రోలింగ్ సరిగా ఉండకపోవడం. శివార్లలో ఉండే వారు చాలా మంది కొత్తవారు కావడంతో ఉగ్రవాదులను పసిగట్టలేకపోవడం జాతీయ రహదారులు శివారు ప్రాంతాలను ఆనుకొని ఉండటంతో రాకపోకలు సులభం ఆకస్మిక వాహన తనిఖీలు ఉండవు బాంబులు సరఫరా చేయడం సులువు