ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వే స్టేషన్‌లోని 4వ ఫ్లాట్‌ఫాంలో 2015 సంవత్సరం నవంబర్ 18వ తేదీన 7 మొబైల్స్, మూడు ల్యాప్‌ట్యాప్‌లు (వివిధ రంగుల్లో, వివిధ కంఫెనీలకు చెందినవి) గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లారు. ఆమేరకు రైల్వే ప్రభుత్వ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా విశాఖపట్నం మువ్వలపాలెం పోలీస్‌స్టేషన్ వారు శుక్రవారం వాటిలో ఓ ల్యాప్‌టాప్, ఓ మొబైల్ ఫోన్‌కు చెందిన బిల్లులతోపాటు తగిన ఆధారాలతో రావడంతో వారికి తిరుపతి రైల్వే ప్రభుత్వ సీఐ రామకృష్ణ నేతృత్వంలో అందజేశారు. మిగిలిన 6 మొబైల్స్, రెండు ల్యాప్‌టాప్‌లకు చెందిన బిల్లులు తగిన ఆధారాలతో సీఐ రామకృష్ణను సంప్రదిస్తే వారికి అందజేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. వివరాలకు 0877 2225347, 94406 27638 సంప్రదించాల్సి ఉందని తెలియజేశారు. (చదవండి: బెడిసికొట్టి జనసేన కిడ్నాప్ డ్రామా)
Comments
Please login to add a commentAdd a comment