జన్నారంలో కరోనా కలకలం.. | Four People Who Were Traveled With Corona Positive Person Were Taken To Quarantine | Sakshi
Sakshi News home page

క్వారంటైన్‌కు నలుగురు తరలింపు..

Published Sun, May 31 2020 3:38 PM | Last Updated on Sun, May 31 2020 3:45 PM

Four People Who Were Traveled With Corona Positive Person Were Taken To Quarantine - Sakshi

సాక్షి, మంచిర్యాల: జిల్లాలోని జన్నారం మండలంలో కరోనా భయపెడుతుంది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన జన్నారం మండలం తపాలపూర్‌కు చెందిన ముంబాయి వలస కార్మికుడితో కలిసి ఒకే వాహనంలో ప్రయాణించిన దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన నలుగురు వ్యక్తులను అధికారులు బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. ఆ నలుగురితో ప్రైమరీ కాంటాక్ట్‌  ఉన్న కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్‌ ముద్రలు వేశారు. జన్నారం మండలంలో ఇప్పటివరకు 11 కరోనా కేసులు నమోదు కాగా, శనివారం ఒక్కరోజే ఆరుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తపాలపూర్‌కు చెందిన నలుగురికి, రోటిగూడకు చెందిన ఇద్దరికి, చింతలపల్లికి చెందిన ఒకరికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో జన్నారంలో కేసుల సంఖ్య 17కు చేరింది. జిల్లాలో కరోనా బారిపడిన వారి సంఖ్య 37కు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement