చెట్టు మీద పండని కాయ | sapota fruit special story about summer special | Sakshi
Sakshi News home page

చెట్టు మీద పండని కాయ

Published Thu, Mar 31 2016 12:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

చెట్టు మీద పండని కాయ - Sakshi

చెట్టు మీద పండని కాయ

తిండి గోల

 

శరీరంలో నిస్సత్తువ ఆవహించినప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే నిమిషాల తేడాతో శరీరం మళ్లీ శక్తిని పుంజుకుంటుంది. పిండిపదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న పండు సోపోటా. అయితే,  ఈ చెట్టు అన్ని ప్రాంతాలలో ఎదగదు. ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతుంది. దిగుబడీ బాగుంటుంది. ఆ విధంగా మన దేశంతో పాటు, మెక్సికో ప్రాంతాలలో సపోటా తోటల సాగు అధికంగా ఉంది. మొట్టమొదటగా స్పానిష్ రాజులు పిలిప్పీన్స్‌లో సపోటా తోటల పెంపకాన్ని ప్రోత్సహించినట్టు చరిత్ర చెబుతోంది. మన దేశంలో సపోటా లేదా చికూ అని, ఫిలిప్పీన్స్‌లో ‘చికో’ అని, ఇండోనేషియాలో ‘సవో’ అని, మలేషియాలో ‘చికు’ అని ఈ పండును అంటారు. సపోట కాయలు చెట్టుకు ఉన్నప్పుడు పండవు. కోసిన తర్వాతనే పండుతాయి. రుచిగా ఉన్నాయి కదా అని సపోటాలను అదేపనిగా తినడం మంచిది కాదు. అజీర్ణంతో పాటు పొట్ట ఉబ్బరం సమస్య కూడా వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement