ఏ సీజన్‌లో లభించే కూరగాయలు, పళ్లను ఆ సీజన్లో తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అంటే ఆయా కాలంలో వచ్చే వైరస్‌లు, రోగాల నుంచి కాపాడతాయని దీని అర్థం. వర్షాకాలం పచ్చగా నిగ నిగలాడుతూ కనిపించే కూరగాయల్లో ఒకటి బోడ కాకర కాయ. వీటినే బొంత కాకర కాయలు అని కూడా పిలుస్తారు. ఇంకా అడవి కాకర, ఆ-కాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే గుణాలు బోడకాకరకాయలో పుష్కలంగా ఉన్నాయి. కండరాలను బలోపేతం చేస్తుందని, సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు నిపుణులు.
శరీరానికి అవసరమైన అన్ని విటమిన్‌లను అందిస్తుంది. విటమిన్ డీ12, విటమిన్ డీ, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం లాంటివి లభిస్తాయి. శరీరంలోని కొవ్వును కరిగించి, బరువు నియంత్రణలో సహాయపడుతుంది. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయి. బోడ కాకరకాయలో ఉండే ఫోలేట్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. దీన్ని ఫ్రై లేదా, ఉల్లిపాయలు, మసాలతో కూర చేసుకుంటారు. పోషకాలతో పోలిస్తే, చికెన్, మటన్ కంటే ఇది చాలా బెటర్ అంటారు.
బోడకాకరతో ఆరోగ్య ప్రయోజనాలు
బోడకాకరతో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకుమంచిది. రోగనిరోధక శక్తిని బలపడుతుంది తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు, కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గిస్తుంది.రక్తపోటు, కేన్సర్ వ్యాధుల నుంచి రక్షించడంలోసాయపడుతుంది. పక్షవాతం, వాపు, అపస్మారక స్థితి, కంటి సమస్యల విషయంలో కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. మొటిమలు రాకుండా నివారిస్తుంది. ఇందులోని ఫ్లావనాయిడ్లు వృద్ధాప్య ముడతలను నివారిస్తాయి. గర్భిణులు ఈ కాయను కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో వర్చే దురదల నుంచి కూడా కాపాడుతుంది
Comments
Please login to add a commentAdd a comment