boda kakarakaya
-
బోడకాకర ఉంటే, మటన్, చికెన్ దండగ, ఒక్కసారి రుచి చూస్తే
ఏ సీజన్లో లభించే కూరగాయలు, పళ్లను ఆ సీజన్లో తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అంటే ఆయా కాలంలో వచ్చే వైరస్లు, రోగాల నుంచి కాపాడతాయని దీని అర్థం. వర్షాకాలం పచ్చగా నిగ నిగలాడుతూ కనిపించే కూరగాయల్లో ఒకటి బోడ కాకర కాయ. వీటినే బొంత కాకర కాయలు అని కూడా పిలుస్తారు. ఇంకా అడవి కాకర, ఆ-కాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే గుణాలు బోడకాకరకాయలో పుష్కలంగా ఉన్నాయి. కండరాలను బలోపేతం చేస్తుందని, సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు నిపుణులు.శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లను అందిస్తుంది. విటమిన్ డీ12, విటమిన్ డీ, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం లాంటివి లభిస్తాయి. శరీరంలోని కొవ్వును కరిగించి, బరువు నియంత్రణలో సహాయపడుతుంది. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయి. బోడ కాకరకాయలో ఉండే ఫోలేట్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. దీన్ని ఫ్రై లేదా, ఉల్లిపాయలు, మసాలతో కూర చేసుకుంటారు. పోషకాలతో పోలిస్తే, చికెన్, మటన్ కంటే ఇది చాలా బెటర్ అంటారు. బోడకాకరతో ఆరోగ్య ప్రయోజనాలుబోడకాకరతో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకుమంచిది. రోగనిరోధక శక్తిని బలపడుతుంది తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు, కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గిస్తుంది.రక్తపోటు, కేన్సర్ వ్యాధుల నుంచి రక్షించడంలోసాయపడుతుంది. పక్షవాతం, వాపు, అపస్మారక స్థితి, కంటి సమస్యల విషయంలో కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. మొటిమలు రాకుండా నివారిస్తుంది. ఇందులోని ఫ్లావనాయిడ్లు వృద్ధాప్య ముడతలను నివారిస్తాయి. గర్భిణులు ఈ కాయను కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో వర్చే దురదల నుంచి కూడా కాపాడుతుంది -
బోడ కాకరలో అధిక పోషక విలువలు ఉన్నాయి..తింటే లాభాలివే
-
బోడకాకర సాగుతో బోలెడు లాభం
విత్తన సేకరణే కీలకం ఉద్యాన శాఖ అధికారి రాకేశ్ చెన్నారావుపేట : కూరగాయ పంటల్లో విశిష్ట ఔషద గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర.ఒకప్పుడు అటవీ ప్రాం తంలో సహజంగా పండే ఈ తీగజాతి పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సుమారు కిలో బోడకాకరకు రూ.120–200 ధర పలుకుతోంది. ప్రస్తుతం చాలా మంది రైతులు చి న్న చిన్న కమతాల్లో సాగు చేసి మంచి లాభాలు గడిస్తున్నారని తొర్రూరు ఉద్యానవన శాఖాధికా రి రాకేష్(8374449378)తెలిపారు. ఈ సం దర్భంగా పంట సాగు గురించి వివరించారు. రెండు జాతులు బోడకాకరలో మైమోర్డియా చైనాన్సిస్, మైమోర్డియా డయోకా జాతులుంటాయి. మన ప్రాం తంలో మైమోర్డియా డయోకా ఎక్కువగా కనిపిస్తుంది. దీని కాయలు 25–40 గ్రాముల బరు వు ఉంటాయి. పూలు పసుపు వర్ణంలో ఉండి సాయంత్రం పూస్తాయి. మే, జూన్ నుంచి అక్టోబర్, నవంబర్ వరకు పంట ఉంటుంది. తర్వా త తీగ చనిపోయి దుంప భూమిలో నిద్రావస్థలోకి వెళ్లి మే, జూన్ నెలల్లో మొలకెత్తుతుంది. విత్తనం లభ్యత అటవీ ప్రాంతంలో సాధారణంగా పండే ఈ పం టకు మార్కెట్లో ప్రత్యేకంగా విత్తనం లభిం చ దు. చిన్న చిన్న దుంపలు లేదా పండిన కాయ ల నుంచి గింజలు సేకరించాలి. మామూలుగా ఎకరానికి 25–30 కిలోల విత్తనం అవసరం. మొల క శాతం 8–10 శాతం మాత్రమే ఉంటుం ది. అందువల్ల ఎక్కువ విత్తనం అవసరం అవుతుం ది. ఆడ, మగ మొక్కలు వేర్వేరుగా ఉంటా యి. అవి మనకు పూత సమయంలోనే గుర్తించడానికి వీలవుతుంది. మగవాటిని గుర్తించి పది శాతం మాత్రమే ఉండేలా చూసుకుని మిగిలిన తీసివేయాలి. దుంపలు–సేకరణ భూమిలో నిద్రావస్థలో ఉన్న దుంపలు జూన్ – అక్టోబర్ మధ్యలో పూతకు వస్తాయి. తక్కువగా పూసే ఆడ మొక్కలను, తక్కువ ఎత్తులో పూసే మగ మొక్కలను ఎంచుకుని వీటి దుంపలు సేకరించి నాటుకోవాలి. మరుసటి సంవత్సరం వీటి ద్వారా ఎక్కువ దుంపలను వృద్ధి చేసుకోవ చ్చు. ఆకులు ఒకే తమ్మెతో ఉన్న తీగలు కలిగిన మెుక్క ఎక్కువ దిగుబడి(2.5 కిలోలు) ఇస్తుంది. ఆకులు 3–5 తమ్మెలుగా ఉన్న తీగల మెుక్క తక్కువ దిగుబడి(1.0–1.5 కిలోలు) ఇస్తుంది. మొదటి రకం ఎంచుకుని సాగుచేస్తే అధిక దిగుబడులు వస్తాయి. నాటే విధానం దుంపలను సాలుకు సాలుకు, మొక్కకు మొక్క కు మధ్య పొడవు, వెడల్పు 2 మీటర్లదూరంలో నాటుకోవాలి. విత్తనం అయితే ప్రతీ గుంతలో 10–15 విత్తనాలు వేయాలి. అందులో నుంచి 3–5 మొక్కలు 40, 45 రోజుల్లో వస్తాయి. పం ట 45 నుంచి 50 రోజుల్లో పూతకు వస్తుంది. పూ త నుంచి కాయ రావడానికి వారం రోజుల సమ యం పడుతుంది. వారానికి రెండు సార్లు కోత కు వస్తుంది. ప్రతీ కోతకు ఎకరానికి 40 నుంచి 50 కిలోల దిగుబడి వస్తుంది. మెుత్తంగా పంట కాలంలో ఎకరానికి 15–20 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు. పందిరి ఏర్పాటు భూమికి 4–66 అడుగుల ఎత్తులో కొబ్బరి తాడు లేదా జేవైర్లతో పందిళ్లు ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై తీగ పారించినట్లయితే నాణ్యత, దిగుబడి పెరుగుతుంది. ఆదాయం–వ్యయం విత్తనం లేదా దుంపల ఖర్చు రూ. 2వేలు(అట వీ ప్రాంతంలో సంపాదించుకుంటే ఖర్చు ఉండ దు). పొలం తయారీ ఖర్చు రూ.5వేలు. పురు గు మందులు, ఎరువుల ఖర్చు రూ.8వేలు. కూలీల ఖర్చు రూ.10వేలు. దిగుబడి 20 క్వింటాళ్లు. కిలో ధర 120 నుంచి 200 వరకు ఉంటుంది. ఎకరానికి ఆదాయం సుమారు రూ. 2.50లక్షలకు పైగా వస్తుంది. -
కిలో రూ.200
బెల్లంపల్లి : వర్షాకాలంలో మాత్రమే లభించే బోడ కాకరకాయల ధర ఆకాశానికి ఎగబాకింది. ఖరీఫ్ సీజన్ ఆరంభమైన సరిగ్గా నెల రోజులకు మార్కెట్లో బోడ కాకరకాయలు అమ్మకానికి వచ్చాయి. ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి బెల్లంపల్లికి బోడ కాకరకాయలను విక్రయానికి తీసుకొచ్చారు. కిలోకు రూ.200 చొప్పున అమ్మారు. వర్షాకాలంలో మాత్రమే అరుదుగా లభించే బోడ కాకరకాయలో ఔషధగుణాలు మెండుగా ఉండడంతో ధర ఎక్కువైనా అనేక మంది కొనుగోలు చేశారు.