కిలో రూ.200
బెల్లంపల్లి : వర్షాకాలంలో మాత్రమే లభించే బోడ కాకరకాయల ధర ఆకాశానికి ఎగబాకింది. ఖరీఫ్ సీజన్ ఆరంభమైన సరిగ్గా నెల రోజులకు మార్కెట్‌లో బోడ కాకరకాయలు అమ్మకానికి వచ్చాయి. ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి బెల్లంపల్లికి బోడ కాకరకాయలను విక్రయానికి తీసుకొచ్చారు. కిలోకు రూ.200 చొప్పున అమ్మారు. వర్షాకాలంలో మాత్రమే అరుదుగా లభించే బోడ కాకరకాయలో ఔషధగుణాలు మెండుగా ఉండడంతో ధర ఎక్కువైనా అనేక మంది కొనుగోలు చేశారు.