దీర్ఘాయుష్షుకు ఉపయోగపడుతుందని భావిస్తున్న ‘యురోలిథిన్ ఏ’ అనే పదార్థాన్ని మనుషుల్లోనూ విజయవంతంగా పరీక్షించారు శాస్త్రవేత్తలు దానిమ్మలో కనిపించే ఈ యురోలిథిన్ ఏ ఇప్పటికే కొన్ని రకాల పురుగులు, ఎలుకల ఆయుష్షును గణనీయంగా పెంచింది. స్విట్జర్లాండ్‌లోని ఈపీఎఫ్‌ఎల్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. యురోలిథిన్ ఏ కణాల్లోని మైటోకాండ్రియా పనితీరును మెరుగుపరచడం ద్వారా వద్ధాప్యంతో వచ్చే సమస్యలను నివారిస్తుందని అంచనా. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ పదార్థం మనకు తెలిసిన ఏ ఆహారంలోనూ ఉండదు. కాకపోతే దానిమ్మ, రాస్ప్‌బెర్రీ వంటి పండ్లలోని కొన్ని రసాయనాలు మన పేగుల్లో యురోలిథిన్ ఏగా విడిపోతాయి. ఈపీఎఫ్‌ఎల్ శాస్త్రవేత్తలు ఈ యురోలిథిన్ ఏ ను కత్రిమంగా తయారు చేసి ప్రయోగాలు చేశారు. వేర్వేరు మోతాదుల్లో 60 మందికి అందించారు. వీరందరూ ఆరోగ్యంగా ఉన్నవారే. కాకపోతే వ్యాయామాలు వంటివి పెద్దగా చేయనివారు. వీరికి వేర్వేరు మోతాదుల్లో యురోలిథిన్ ఏను అందించారు. 500 నుంచి వెయ్యి మిల్లీగ్రాములు ఇచ్చినప్పుడు మైటోకాండ్రియా పనితీరులో మార్పు కనిపించిందని వ్యాయామం చేస్తే ఎలాంటి వచ్చే ఫలితాలు ఈ మందు ద్వారా వచ్చాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జొహాన్ అవురెక్స్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment