
సాక్షి, చెన్నై: ఈరోడ్ జిల్లా సెన్నిమలైకు చెందిన ఓ కుటుంబంలోని వారికి విటమిన్ పేరిట విషం మాత్రలు ఇవ్వడంతో ముగ్గురు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నిమలైకి చెందిన కరుప్పన్నన్, ఆయన భార్య మల్లిక, కుమార్తె దీప, పని మనిషి కరుప్పాయి శనివారం సాయంత్రం పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో వీరి పొలంలో కొంత భాగాన్ని లీజుకు తీసుకున్న కళ్యాణ సుందరం కూడా అక్కడే ఉన్నాడు. అటువైపు కరోనా శిబిరం నుంచి వచ్చినట్టు పేర్కొంటూ యువకుడు ఫీవర్ టెస్ట్ చేసి విటమిన్ మాత్రలు ఇచ్చి వెళ్లాడు.
అవి వేసుకున్న కాసేపటికే కరుప్పన్నన్ కుటుంబం స్పృహ తప్పింది. గమనించిన ఇరుగుపొరుగు వారిని ఆస్పత్రికి తరలించగా మల్లిక, కరుప్పాయి, దీప మృతి చెందారు. కరుప్పన్నన్ కోయంబత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కల్యాణ సుందరం ఆ మాత్రలు వాడకపోవడంతో అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించారు. కరుప్పన్నన్ పొలం లీజుతో పాటు ఆయన నుంచి తీసుకున్న రూ.13 లక్షలు చెల్లించలేని స్థితిలో హత్యకు పథకం పన్నినట్టు అంగీకరించాడు.
చదవండి:
జూన్‌లో 10.8 కోట్ల కోవిషీల్డ్ టీకాలు ఉత్పత్తి చేసిన సీరమ్
ఐటీ సంస్థ మహిళా అధికారి ఆత్మహత్య