మైకా గనిలో...టీడీపీ రౌడీల విధ్వంసం | TDP MLAs take control of Mica Quartz mine | Sakshi
Sakshi News home page

మైకా గనిలో...టీడీపీ రౌడీల విధ్వంసం

Published Fri, Nov 22 2024 5:46 AM | Last Updated on Fri, Nov 22 2024 5:46 AM

TDP MLAs take control of Mica Quartz mine

దౌర్జన్యంగా చొరబడి అడ్డొచ్చిన వారిని చితకబాదిన వైనం 

సీసీ కెమెరాలు, యంత్రాలు ధ్వంసం  

కాపలాగా ఉన్న గిరిజనుల గుడిసెల తొలగింపు 

గనిని స్వాదీనం చేసుకున్న నెల్లూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు

సాక్షి, తిరుపతి టాస్క్‌ఫోర్స్‌: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురంలోని ఓ మైకా క్వార్ట్‌ ్జ గనిని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు బుధవారం దౌర్జన్యంగా స్వాదీనం చేసుకున్నారు. లీజు వేరొకరి పేరున ఉన్నా, రౌడీలను రంగంలోకి దింపి దాడులు చేసి గనిలో విధ్వంసం సృష్టించారు. గనిలో పనిచేసే వారిని భయభ్రాంతులకు గురిచేసి తరిమేశారు. ఆపై గనిలో తిష్టవేశారు. కొంత కాలంగా కూటమి పారీ్టల నేతలు తిరుపతి – నెల్లూరు జిల్లా సరిహద్దులోని మైకా, మైకా క్వార్ట్‌ ్జ, సిలికా ఖనిజంపై కన్నేశారు. 

లీజు దారులతో ఐదు నెలలుగా మంతనాలు నెరుపుతూ వచ్చారు. వారు లొంగకపోవడంతో రకరకాలుగా ఇబ్బందులకు గురిచేసి ఒక్కొక్కటిగా స్వా«దీనం చేసుకుంటున్నారు. వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండల పరిధిలో మైకా క్వార్ట్‌ ్జ ఖనిజం గనులు సుమారు వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో గతంలో 140 వరకు గనులు ఉండేవి. అన్ని గనుల్లో అత్యంత నాణ్యమైన ఖనిజం దొరక్కపోవడంతో ప్రస్తుతం 10 మాత్రమే కొనసాగుతున్నాయి. 

కొంత కాలంగా ఈ ఖనిజానికి చైనాలో డిమాండ్‌ పెరిగింది. టన్ను రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు అమ్ముడుపోతోంది. దీంతో ఒక్కో గనిలో రోజుకు 50 నుంచి 100 టన్నుల వరకు ఖనిజాన్ని వెలికి తీస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని మైకా క్వార్ట్‌ ్జ గనుల్లో ఖనిజం తవ్వకాలను ఆపేసింది. ఆ తర్వాత కీలక మంత్రి ఆదేశాల మేరకు ఓ గనిలో తవ్వకాలు ప్రారంభించారు. లైసెన్స్‌ ఉన్న ఆ వ్యాపారి యువ మంత్రికి ముఖ్య అనుచరుడు. మరో రెండు నెలల తర్వాత ఇంకో రెండు గను­ల్లో తవ్వకాలకు ప్రభుత్వ పెద్దలు పచ్చ జెండా ఊపారు. 

ఈ నేపథ్యంలో సైదాపురం మండలం జోగుపల్లిలోని ‘చుక్క పాత్ర’ గనిపై నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల కన్ను పడింది. ఎవరంతకు వారు స్వాదీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తుదకు వారిద్దరూ కలిసి కబ్జాకు పూనుకున్నారు. వారికి గనిని అప్పగించేందుకు యజమాని ససేమిరా అనడంతో ఓ ఎమ్మెల్యే తన అనుచరులను రంగంలోకి దింపారు. 

నెల్లూరు జిల్లా కనుపూరుకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడు బుధవారం సాయంత్రం 50 మంది రౌడీ మూకలతో ఆ గనిలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. యంత్రాలు, సీసీ కెమెరాలన్నింటినీ ధ్వంసం చేసి.. కాపలాగా ఉన్న గిరిజనుల గుడిసెలను పీకేశారు. అడ్డొచ్చిన వారిని చితకబాదారు. ఆపై గనిని స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటనపై గని యజమాని చరణ్‌ సైదాపురం పోలీసులు, నెల్లూరు జిల్లా ఉన్నతాధికారుల­కు సమా­చారం ఇచ్చినా, ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది.

మైకా, మైకా క్వార్ట్‌ ్జ,  ఉపయోగాలు 
సైదాపురం మండలంలో మైకా, మైకా క్వార్ట్‌ ్జ, ఫల్స్‌పర్, పవర్‌ ముఖ్‌లైట్‌ వంటి ఖనిజాలు లభ్యమవుతున్నాయి. మైకా క్వార్ట్‌ ్జని అణువిద్యుత్, సోలార్‌ ప్లేట్ల కోసం వినియోగిస్తారు. మిగిలిన రకాలను టైల్స్‌ పరిశ్రమలు, సిగరెట్‌ ప్యాకెట్‌ లోపల సిల్వర్‌ కలర్‌ పేపర్‌ కోసం, కూలింగ్‌ గ్లాస్‌ల తయారీకి వినియోగిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement