Mica mining
-
మైకా గనిలో...టీడీపీ రౌడీల విధ్వంసం
సాక్షి, తిరుపతి టాస్క్‌ఫోర్స్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురంలోని ఓ మైకా క్వార్ట్ ్జ గనిని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు బుధవారం దౌర్జన్యంగా స్వాదీనం చేసుకున్నారు. లీజు వేరొకరి పేరున ఉన్నా, రౌడీలను రంగంలోకి దింపి దాడులు చేసి గనిలో విధ్వంసం సృష్టించారు. గనిలో పనిచేసే వారిని భయభ్రాంతులకు గురిచేసి తరిమేశారు. ఆపై గనిలో తిష్టవేశారు. కొంత కాలంగా కూటమి పారీ్టల నేతలు తిరుపతి – నెల్లూరు జిల్లా సరిహద్దులోని మైకా, మైకా క్వార్ట్ ్జ, సిలికా ఖనిజంపై కన్నేశారు. లీజు దారులతో ఐదు నెలలుగా మంతనాలు నెరుపుతూ వచ్చారు. వారు లొంగకపోవడంతో రకరకాలుగా ఇబ్బందులకు గురిచేసి ఒక్కొక్కటిగా స్వా«దీనం చేసుకుంటున్నారు. వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండల పరిధిలో మైకా క్వార్ట్ ్జ ఖనిజం గనులు సుమారు వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో గతంలో 140 వరకు గనులు ఉండేవి. అన్ని గనుల్లో అత్యంత నాణ్యమైన ఖనిజం దొరక్కపోవడంతో ప్రస్తుతం 10 మాత్రమే కొనసాగుతున్నాయి. కొంత కాలంగా ఈ ఖనిజానికి చైనాలో డిమాండ్ పెరిగింది. టన్ను రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు అమ్ముడుపోతోంది. దీంతో ఒక్కో గనిలో రోజుకు 50 నుంచి 100 టన్నుల వరకు ఖనిజాన్ని వెలికి తీస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని మైకా క్వార్ట్ ్జ గనుల్లో ఖనిజం తవ్వకాలను ఆపేసింది. ఆ తర్వాత కీలక మంత్రి ఆదేశాల మేరకు ఓ గనిలో తవ్వకాలు ప్రారంభించారు. లైసెన్స్ ఉన్న ఆ వ్యాపారి యువ మంత్రికి ముఖ్య అనుచరుడు. మరో రెండు నెలల తర్వాత ఇంకో రెండు గనుల్లో తవ్వకాలకు ప్రభుత్వ పెద్దలు పచ్చ జెండా ఊపారు. ఈ నేపథ్యంలో సైదాపురం మండలం జోగుపల్లిలోని ‘చుక్క పాత్ర’ గనిపై నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల కన్ను పడింది. ఎవరంతకు వారు స్వాదీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తుదకు వారిద్దరూ కలిసి కబ్జాకు పూనుకున్నారు. వారికి గనిని అప్పగించేందుకు యజమాని ససేమిరా అనడంతో ఓ ఎమ్మెల్యే తన అనుచరులను రంగంలోకి దింపారు. నెల్లూరు జిల్లా కనుపూరుకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడు బుధవారం సాయంత్రం 50 మంది రౌడీ మూకలతో ఆ గనిలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. యంత్రాలు, సీసీ కెమెరాలన్నింటినీ ధ్వంసం చేసి.. కాపలాగా ఉన్న గిరిజనుల గుడిసెలను పీకేశారు. అడ్డొచ్చిన వారిని చితకబాదారు. ఆపై గనిని స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటనపై గని యజమాని చరణ్ సైదాపురం పోలీసులు, నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా, ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది.మైకా, మైకా క్వార్ట్ ్జ, ఉపయోగాలు సైదాపురం మండలంలో మైకా, మైకా క్వార్ట్ ్జ, ఫల్స్‌పర్, పవర్ ముఖ్‌లైట్ వంటి ఖనిజాలు లభ్యమవుతున్నాయి. మైకా క్వార్ట్ ్జని అణువిద్యుత్, సోలార్ ప్లేట్ల కోసం వినియోగిస్తారు. మిగిలిన రకాలను టైల్స్ పరిశ్రమలు, సిగరెట్ ప్యాకెట్ లోపల సిల్వర్ కలర్ పేపర్ కోసం, కూలింగ్ గ్లాస్‌ల తయారీకి వినియోగిస్తారు. -
మైకాకు జీఎస్టీ షాక్
► 14.5 నుంచి 28 శాతం పన్ను బాదుడు ► పౌడర్ ఫ్యాక్టరీలపైనా ప్రభావం ► జీఎస్టీ తగ్గించకపోతే ఫ్యాక్టరీలు మూతపడే అవకాశం సైదాపురం(వెంకటగిరి): కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న జీఎస్టీ మైకా, క్వార్ట్జ్, పౌడర్ ఫ్యాక్టరీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. నాలుగు శ్లాబుల్లో అత్యధికంగా ఉన్న 28 శాతం జీఎస్టీ పౌడర్ ఫ్యాక్టరీలపై పడనుంది. ఇప్పటివరకు వ్యాట్ రూపంలో 14.5 శాతం పన్నులు మాత్రమే ఫ్యాక్టరీలపై పడేది. అందులో కూడా ఇన్పుట్ సబ్సిడీ 12 శాతం ఫ్యాక్టరీ యాజమానులకు తిరిగొచ్చేది. తాజాగా జీఎస్టీ ప్రభావంతో మెటీరియల్ కొనుగొలు చేసేవారు పన్నులను భరించాల్సి ఉంటుంది. ఒక్కసారిగా 28శాతం పన్నుల రూపంలో పెరిగితే మెటిరియల్ కొనే నాథుడే ఉండరని ఫ్యాక్టరీ యాజమానులు వాపోతున్నారు. అదనపు భారం భరించాల్సిందే జిల్లాలో మైకా పరిశ్రమకు ఎంతో పేరుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే మైకా పరిశ్రమలు ప్రధానంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉన్నాయి. మైకా, క్వార్ట్జ్, తదితర ఖనిజాలను పౌడర్ చేసే ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఇటీవలి కాలంలో సైదాపురం మండలంలో విస్తారంగా ఏర్పాటుచేశారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా రెండువేల మందికి, పరోక్షంగా రెండువేల మందికి ఉపాధి దొరుకుతోంది. కరెంట్ బిల్లుల నుంచి కూలీల వరకు రోజురోజుకు పెరిగి పోతుండటంతో కొందరు యాజమానులు ఫ్యాక్టరీలను లీజులకు ఇచ్చేస్తున్నారు. ఈతరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈపరిశ్రమకు మరోషాక్ ఇచ్చింది. గతంలో 14.5 శాతం ఉన్న పన్నులను ఒక్కసారిగా 28శాతం చేయడంతో దీని ప్రభావం ఫ్యాక్టరీలపై పడనుంది. బ్యాంకుల్లో లక్షల రూపాయలు అప్పు చేసి స్థాపించిన ఫ్యాక్టరీలు అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. జీఎస్టీ ప్రభావంతో తమకు ఉపాధి ఎక్కడ పోతుందోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పనిచేసేవారిలో ఎక్కువగా జార్ఖండ్, బిహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారే. ఎక్స్‌పోర్టర్స్ కూడా పన్ను చెల్లించాల్సిందే.. గతంలో ఉన్న ప్రభుత్వాలు విదేశీ మారక ద్రవ్యాన్ని రాబట్టుకునేందుకు ఎక్స్పోర్ట్ చేసే వారిని పన్నుల నుంచి మినహాయింపులు ఇచ్చేవి. అయితే జీఎస్టీ కారణంగా వారు కూడా పన్నుల లెక్కల్లోకి వచ్చారు. వారు ఎంత ఎగుమతులు చేశారు? అనే వివరాలు కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాతే పన్ను నుంచి వెసులుబాటు వచ్చేలా నిబంధనలు విధించారు. 13శాతం అదనంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టి జీఎస్టీ కారణంగా పరిశ్రమలపై 13.5 శాతం అదనపు భారం పడుతుంది. దీంతో తీరని నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం స్పందించి జీఎస్టీలో మార్పులు తీసుకుని వస్తేనే ఫ్యాక్టరీలు నిలిచే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో భారీ నష్టలు తప్పవు. – సీలార్, పౌడర్ ఫ్యాక్టరీ మేనేజర్