మొటిమల సమస్యా? మీ కోసమే.. | Benefits Of Sea Salt For Acne Problems | Sakshi
Sakshi News home page

మొటిమల సమస్యా? మీ కోసమే..

Published Wed, Sep 16 2020 4:42 PM | Last Updated on Wed, Sep 16 2020 9:22 PM

Benefits Of Sea Salt For Acne Problems - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలో ప్రతి ఒక్కరు నిగనిగలాడే చర్మ సౌందర్యాన్ని కోరుకుంటారు. కానీ ప్రస్తుత పోటీ యుగంలో త్రీవ ఒత్తిడి, ఆహారపు అలవాట్లు తదితర కారణాలతో మొటిమలు, పొడి చర్మం తదితర సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యతో ఇబ్బందిపడే వారు కాస్మొటిక్స్ మందులు, క్రీమ్స్‌, వాడి లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తుంటారు. అయితే ఇంటి చిట్కాలతో మొటిమల సమస్యను తగ్గించవచ్చు. కాగా నిగనిగలాడే మెరిసే చర్మం కావాలనుకునేవారికి గళ్ల ఉప్పు (సీ సాల్ట్ ‌లేదా సముద్రపు ఉప్పు) వాడడమే మేలైన పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. మొటిమలతో బాధపడ్తున్న వేలాది మంది సీసాల్ట్‌ ఉపయోగించి ప్రయోజం పొందారు.

గళ్ల ఉప్పు (సీ సాల్ట్‌) ప్రయోజనాలు
గళ్లఉప్పులో చర్మ సంరక్షణకు కావాల్సిన పోషకాలు, ఖనిజాలు లభిస్తాయి. అంతేకాక సీ సాల్ట్‌లో ఉండే మెగ్నిషియం, కాల్షియం, సోడియం పొటాషియం తదితర లవణాలతో చర్మం మెరిసేందుకు తోడ్పడుతుంది.

చర్మానికి ఉపయోగించే విధానం
మొదటగా ఒక బౌల్‌(గిన్నె) తీసుకొవాలి. తర్వాత  టేబుల్‌ స్పూన్‌ సేంద్రీయ తేనె, టీస్పూన్‌ సీసాల్ట్, 6 చుక్కల నిమ్మరసం తదితర మిశ్రమాలను గిన్నెలో వేసి కలపాలి. మిశ్రమాన్ని కలిపాక మొఖానికి  5 నుంచి 10నిమిషాలు నెమ్మదిగా మర్ధన చేయడం ద్వారా మొటిమలు, జిడ్డు చర్మం, పోడిబారిన చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మ సమస్యతో బాధపడేవారు ఆలస్యం చేయకుండా సీసాల్ట్ వినియోగించుకుంటే చర్మ సంరక్షణకు ఎంతో మేలు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement