Sea Salt
-
మొటిమల సమస్యా? మీ కోసమే..
న్యూఢిల్లీ: ప్రపంచంలో ప్రతి ఒక్కరు నిగనిగలాడే చర్మ సౌందర్యాన్ని కోరుకుంటారు. కానీ ప్రస్తుత పోటీ యుగంలో త్రీవ ఒత్తిడి, ఆహారపు అలవాట్లు తదితర కారణాలతో మొటిమలు, పొడి చర్మం తదితర సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యతో ఇబ్బందిపడే వారు కాస్మొటిక్స్ మందులు, క్రీమ్స్, వాడి లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తుంటారు. అయితే ఇంటి చిట్కాలతో మొటిమల సమస్యను తగ్గించవచ్చు. కాగా నిగనిగలాడే మెరిసే చర్మం కావాలనుకునేవారికి గళ్ల ఉప్పు (సీ సాల్ట్ లేదా సముద్రపు ఉప్పు) వాడడమే మేలైన పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. మొటిమలతో బాధపడ్తున్న వేలాది మంది సీసాల్ట్ ఉపయోగించి ప్రయోజం పొందారు. గళ్ల ఉప్పు (సీ సాల్ట్) ప్రయోజనాలు గళ్లఉప్పులో చర్మ సంరక్షణకు కావాల్సిన పోషకాలు, ఖనిజాలు లభిస్తాయి. అంతేకాక సీ సాల్ట్‌లో ఉండే మెగ్నిషియం, కాల్షియం, సోడియం పొటాషియం తదితర లవణాలతో చర్మం మెరిసేందుకు తోడ్పడుతుంది. చర్మానికి ఉపయోగించే విధానం మొదటగా ఒక బౌల్(గిన్నె) తీసుకొవాలి. తర్వాత టేబుల్ స్పూన్ సేంద్రీయ తేనె, టీస్పూన్ సీసాల్ట్, 6 చుక్కల నిమ్మరసం తదితర మిశ్రమాలను గిన్నెలో వేసి కలపాలి. మిశ్రమాన్ని కలిపాక మొఖానికి 5 నుంచి 10నిమిషాలు నెమ్మదిగా మర్ధన చేయడం ద్వారా మొటిమలు, జిడ్డు చర్మం, పోడిబారిన చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మ సమస్యతో బాధపడేవారు ఆలస్యం చేయకుండా సీసాల్ట్ వినియోగించుకుంటే చర్మ సంరక్షణకు ఎంతో మేలు. -
సముద్రపు ఉప్పులో కూడా ప్లాస్టిక్
న్యూయార్క్: సముద్రపు నీరు కలుషితం అవుతున్న విషయం మనకు ఇప్పటికే తెలుసు. సముద్రం నీటి నుంచి తయారవుతున్న ఉప్పు కూడా కలుషితం అవుతున్న కొత్త విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. లండన్, యూరప్, అమెరికా, చైనా దేశాల్లో విక్రయిస్తున్న సముద్రపు ఉప్పులో చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. విక్రయ కేంద్రాల్లో కలుస్తున్నది కాదని, సముద్రంలోనే కలుస్తుందన్న విషయం సముద్ర ఉప్పు క్షేత్రాల్లో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాల చేపల్లో కూడా చిన్న చిన్న ప్లాస్లిక్ ముక్కలు ఉంటున్న విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు ఇటీవలనే కనుగొన్నారు. మైక్రోవైబర్స్, ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ బాటిల్ లాంటి వాటివల్ల ఈ ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోతోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్లాస్టిక్ ఒక్క వాతావరణాన్నే కాకుండా గాలిని, నీరును, మనం తినే ఉప్పు, ఆహారాన్ని ఎక్కువగా కలుషితం చేస్తోందని న్యూయార్క్ యూనివర్శిటీ ప్రొఫెసర్ షెర్రీ మాషన్ తెలిపారు. ఒకసారి ప్లాస్టిక్ సముద్రపు నీటిలో కలిస్తే అది విషవాయువులకు, విష పదార్థాలకు అయస్కాంతంలా మారుతోందని ఆమె తెలిపారు. ఫలితంగా మంచినీళ్లలో, బీరుల్లో ప్లాస్టిక్ ముక్కలు వచ్చి చేరుతున్నాయని చెప్పారు. ఓ మనిషి శరీరంలోకి సరాసరిన సంవత్సరానికి 660 ప్లాస్టిక్ ముక్కలు పోతున్నాయని అన్నారు. అయితే వాటివల్ల మానవ ఆరోగ్యానికి కలుగుతున్న నష్టమేమిటో ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని ఆమె చెప్పారు.