మియామి : అచ్చంగా మన సౌర వ్యవస్థను పోలిన మరో సౌర వ్యవస్థను అమెరికాకు చెందిన నాసా గుర్తించింది. కెప్లర్ టెలిస్కోప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో.. భూమికి 2,545 కాంతి సంవత్సరాల దూరంలో ఈ సౌర వ్యవస్థ ఉన్నట్లు నాసా అధికారులు ప్రకటించారు.
మన సౌర వ్యవస్థలో సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించిన విధంగానే.. అంతరిక్షంలో కొత్తగా గుర్తించిన సౌర వ్యవస్థలోనూ ఒక నక్షత్రం చుట్టూ.. గ్రహాలు తిరుగుతున్నాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. తాజాగా గుర్తించిన సౌర వ్యవస్థలో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. ఇందులో ఎక్కడా జీవరాశి మనుగడ సాగించేందుకు అవకాశం లేదని నాసా తెలిపింది.
కొత్తగా కనుగొన్న సౌర వ్యవస్థలోని కెప్లర్ 90ఐ గ్రహంలో రాళ్లు, పర్వతాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఆ గ్రహం నక్షత్రం చుట్టూ ఒకసారి తిరిగేందుకు 14.4 రోజుల సమయం పడుతుందని నాసా తెలిపింది. అంటే భూమి మీద రెండు వారాల సమయం.. అక్కడ ఒక్క రోజుతో సమానం. మన భూమితో పోలిస్తే అక్కడ ఉష్ణోగ్రత చాలా అధికం. కెప్లెర్ 90ఐ గ్రహం మీద.. 426 డిగ్రీల సెల్సియెస్ వేడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment