న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాను వెనక్కునెట్టి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర శుక్రవారం 1.6 శాతం పెరిగి రూ.1,099.80 ఆల్‌టైమ్ హై స్థాయికి చేరింది. దీంతో అంబానీ సంపద 44.3 బిలియన్ డాలర్ల(దాదాపు 3.05 లక్షల కోట్లు)కు పెరిగి ఉంటుందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.
జాక్ మా సంపద విలువ 44 బిలియన్ డాలర్లు(3.03 లక్షల కోట్లు)గా ఉంది. ఈ ఏడాది ముకేశ్ అంబానీ సంపద 4 బిలియన్ డాలర్లమేర పెరిగితే, జాక్ మా సంపద 1.4 బిలియన్ డాలర్లమేర హరించుకుపోయింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment