దేశీయ బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీ..మరో బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీకి భారీ షాకిచ్చారు. ముఖేష్ అంబానీతో పాటు గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్,సెర్గీ బ్రిన్‌లను అధిగమించి 118బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలోని 6వ అత్యంత ధనవంతుల జాబితాలో నిలిచారు. ఇక ఇన్వెస్ట్‌మెంట్ మాంత్రికుడు వారెన్ బఫెట్‌ను అధిగమించేందుకు అదానీకి కేవలం 9 బిలియన్ల సంపద అవసరం. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్ల ధరలు రాకెట్ వేగంతో పెరగడం వల్ల కేవలం 4నెలల కాలంలో అదానీ సంపద 53శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
అదానీ నెట్ వర్త్
దేశీయ స్టాక్ మార్కెట్‌లో గౌతమ్ అదానీకి చెందిన క్లీన్ ఎనర్జీ, ఎయిర్ పోర్ట్, పవర్ ప్లాంట్ షేర్ల ధరలు రాకెట్ వేగంతో పెరిగాయి. దీంతో అదానీ టాప్-6 వరల్డ్ రిచెస్ట్ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ, రెనెవేబుల్ ఎనర్జీ షేర్లు ఈ ఏడాదిలో 60శాతం పెరిగాయి. మొత్తంగా అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీ షేర్లు 111శాతం వృద్ధిని సాధించాయి. ఇక స్టాక్ మార్కెట్‌లో మోస్ట్ వ్యాలీడ్ మార్కెట్ కేపిటలైజేషన్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీతో టాప్-10 కంపెనీల్లో ఒకటిగా ఎయిర్టెల్ పోటీ పడుతుంది. గౌతమ్ అదానీ ఆస‍్తులు పెరగడానికి కారణం..గత శుక్రవారం అబుదబీ ఇంటర్నేషన్ హోల్డింగ్స్(ఐహెచ్‌సీ) అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ ఎంటర్ ప్రైజెస్‌లో 2బిలియన్ డాలర్లను పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. దీంతో గౌతమ్ అదానీ షేర్లు లాభాల బాట పట్టాయి.
సంవత్సరంలోనే డబుల్‌కి డబుల్ అయ్యాయి
గత శుక్రవారం కొన్ని నివేదికల ప్రకారం..అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 25శాతం పెరిగాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు 11శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు 3శాతం పెరిగాయి. ఏప్రిల్ 4న బ్లూమ్ బెర్గ్ టాప్ -10..100 బిలియన్ క్లబ్‌లో భారత్ నుంచి అదానీ చేరారు. ఇక అనూహ్యంగా గతేడాది ఏప్రిల్ నెల నుంచి 54 బిలియన్ డాలర్ల నుంచి ఈ రోజుతో 118బిలియన్ డాలర్లను అర్జించారు.
అంబానీకి షాక్
ఇదిలా ఉండగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కొన్ని సంవత్సరాలుగా ఈ జాబితాలో అత్యంత సంపన్న భారతీయుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు 95.2 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ ర్యాంకింగ్‌లో 11 వ స్థానంలో ఉన్నారు. తాజాగా అదానీ..అంబానీని దాటేసి ఏకంగా ఆరో స్థానానికి చేరారు.
Comments
Please login to add a commentAdd a comment