
ఫొటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసేందుకు తన కారును అమ్ముకోవాల్సివచ్చింది. అయినా అతను బాధపడలేదు. ఎందుకంటే తన కల నెరవేర్చుకునేందుకు కారు అమ్మడం అతనికి తప్పనిసరి అయ్యింది. ఇప్పుడతను తన బిజినెస్ కారణంగా ఏటా 10 మిలియన్ పౌండ్లు(సుమారు రూ.103 కోట్లు) సంపాదిస్తున్నాడు.
ఐటీ సొల్యూషన్ బిజినెస్ ప్రారంభించి..
బ్రిటన్‌కు చెందిన 40 ఏళ్ల రాబ్‌డెన్స్ జీసీఎస్‌సీ పూర్తి చేసిన తరువాత స్కూలుకు వెళ్లడం మానివేశాడు. బిజినెస్ చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాడు. డైలీ స్టార్ రిపోర్టులో తెలిపిన వివరాల ప్రకారం తన తల్లిదండ్రుల గ్యారేజీలో ఐటీ సొల్యూషన్ బిజినెస్ ప్రారంభించాడు. ఇందుకోసం రాబ్‌డెన్స్ 2008లో తన కారును వెయ్యి పౌండ్లకు అమ్మేశాడు. ఇప్పుడతను పెద్ద ఐటీ కన్సల్టెన్సీ కంపెనీకి సీఈఓ.
‘ఇన్నోవేటివ్‌గా ఉండేవాడిని’
ఈ కంపెనీలో వందమందికిపైగా సిబ్బంది ఉన్నారు. ఈ కంపెనీని నెలకొల్పి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రాబ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాబ్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను స్కూలు చదువులో ప్రతిభ చూపలేకపోయేవాడిని. అయితే ఇన్నోవేటివ్‌గా ఉండేవాడిని. ఏ పరికరం ఎలా పనిచేస్తోందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపేవాడిని. నేను వ్యాపారం ప్రారంభించినప్పుడు నాతో పాటు ఒకరు ఉండేవారు. అతను అడ్మిన్‌తోపాటు అకౌంట్స్ చూసుకునేవాడు. 18 నెలలకే మా సంస్థలో 10 మంది సిబ్బంది ఉండేవారు. కరోనా మహమ్మారి సమయంలోనూ మా వ్యాపారం అభివృద్ధిదాయకంగా ముందుకుసాగింది. ప్రస్తుతం మేము 10 మిలియన్ పౌండ్లకు పైగా బిజినెస్ చేస్తున్నాం. వ్యాపారరంగంలో మేము ఇంతలా రాణించిన నేపధ్యంలో పలు పురస్కారాలు అందుకున్నాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment