
ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: మధ్యప్రదేశ్, ఇండోర్ పోలీసులు ముందుకు ఓ అసాధారణ కేసు వచ్చింది. కోటీశ్వరుడి భార్య.. వయసులో తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన ఆటో డ్రైవర్‌తో పరార్ అయ్యింది. వెళ్తూ వెళ్తూ 47 లక్షల రూపాయలు తనతో తీసుకెళ్లింది. దాంతో ఆ కోటీశ్వరుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కోటీశ్వరుడి భార్య, ఆటో డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.
ఇండోర్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్‌కు కొన్ని నెలల క్రితం సదరు కోటీశ్వరుడి భార్యతో పరిచయం ఏర్పడింది. రెండు, మూడు సార్లు ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కోటీశ్వరుడి భార్య, ఆటో డ్రైవర్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోతూ పోతూ తనతో పాటు 47 లక్షల రూపాయలు పట్టుకెళ్లింది.
(చదవండి: వైరల్: భర్త మరో మహిళతో జిమ్‌లో.. చెప్పులతో చితకబాదిన భార్య)
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఖంద్వా, ఉజ్జయిని, రత్లామ్ ప్రాంతాల్లో గాలించి.. ఆటోడ్రైవర్‌ని, సదరు మహిళను అదుపులోకి తీసకున్నారు. ఆటో డ్రైవర్ వద్ద నుంచి 33 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment