మాజీ కార్పొరేటర్‌ నివాసంలో రూ.40 కోట్లు | Rs 40 crores demonetised notes recovered from former corporator’s house in Bengaluru | Sakshi
Sakshi News home page

మాజీ కార్పొరేటర్‌ నివాసంలో రూ.40 కోట్లు

Published Fri, Apr 14 2017 3:37 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

మాజీ కార్పొరేటర్‌ నివాసంలో రూ.40 కోట్లు

మాజీ కార్పొరేటర్‌ నివాసంలో రూ.40 కోట్లు

బెంగళూరు : బెంగళూరులో ఓ మాజీ కార్పొరేటర్‌ నివాసంలో పెద్ద ఎత్తున దొరికిన పాతనోట్లను చూసి పోలీసులే అవాక్కు అయ్యారు. వివరాల్లోకి వెళితే.... మాజీ కార్పొరేటర్‌ వి నాగరాజ్‌ నివాసంలో శుక్రవారం పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా రూ.40 కోట్ల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అంతకు ముందు తాళం వేసి ఉన్న ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు లాక్‌ పగలగొట్టి లోనికి వెళ్లగా, అక్కడ గదుల్లో పెద్ద ఎత్తున నగదు గుట్టలుగా పడి ఉండటాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

అనంతరం ఆ ఇంటిని పోలీసులు సీజ్‌ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ రాష్ట్రవ్యాప్తంగా అప్పటి నుంచి దాడులు చేపట్టి పెద్ద మొత్తంలో నల్లధనాన్ని స్వాధీనం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement