
అందాలు ఎరవేసి.. అందినకాడికి దోచేసి
బొమ్మనహళ్లి (బెంగళూరు): అందాన్ని ఎరగా వేసి అమాయకులను మోసగిస్తున్న కుష్బూ శర్మ అనే యువతిని బెంగళూరు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈమె బాధితులు ఏపీ,తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్‌లలో ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో కలిపి కుష్బుపై వందకు పైగా కేసులు నమోదయ్యాయి. రాజస్తాన్‌కు చె ందిన కుష్బు ఫేస్‌బుక్ ద్వారా యువకులతో పరిచయాలు పెంచుకునేది. వారిని కాఫీ కేఫ్‌లు, రెస్టారెంట్లకు ఆహ్వానించి సన్నిహితంగా ఉన్నప్పుడు సెల్ఫీలు తీసుకునేది.
అనంతరం డబ్బు ఇవ్వాలని.. ఇవ్వకుంటే అత్యాచార యత్నం చేశారని కేసు పెడతానని బెదిరించేది. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ ధనిక న్యాయవాది ఆమెకు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. అనంతరం ఆఫీసు విషయం మాట్లాడటానికని అతని ఇంటికి వెళ్లి, రూ.1.75 లక్షల నగదు, ఐఫోన్‌తో పారిపోయింది. కొన్ని రోజుల అనంతరం మళ్లీ న్యాయవాదికి ఫోన్ చేయడంతో పోలీసులు పట్టుకున్నారు.