బంజారాహిల్స్‌లో వ్యభిచారం.. నటి అరెస్టు | Bollywood Actress CAUGHT In Prostitution at Banjara Hills police | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో వ్యభిచారం.. నటి అరెస్టు

Jul 8 2018 8:02 AM | Updated on Apr 3 2019 6:34 PM

Bollywood Actress CAUGHT In Prostitution at Banjara Hills police - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. శనివారం నిర్వహించిన తనిఖీల్లో వ్యభిచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులతో పాటు, నిర్వాహకుడిని అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌కు చెందిన జనార్దన్‌రావు రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన జనార్దన్‌ గతంలో ఆ ప్రాంతానికి చెందిన అమ్మాయిలను నగరానికి తరలించి వ్యభిచారం నిర్వహించేవాడు.

ఈ క్రమంలోనే తాజాగా ముంబైకి చెందిన ఓ బాలీవుడ్‌ నటిని రప్పించాడు. సైనిక్‌పురికి చెందిన అమిత్‌ మహేంద్ర అనే విటుడిని హోటల్‌కు  పిలిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ నాగేశ్వర్‌రావు తన సిబ్బందితో కలిసి హోటల్‌లో తనిఖీ చేయగా రూ.40,400 నగదుతో పాటు 3 సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాలీవుడ్‌ నటి, విటుడితో పాటు సూత్రధారి జనార్దన్‌రావును అరెస్టు చేసి బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement