సాక్షి, ముంబై: ముంబై పోలీసులు అంతర్జాతీయ వ్యభిచార రాకెట్‌ను ఛేధించారు. ఈ కేసులో బాలీవుడ్ కొరియో గ్రాఫర్ ఆగ్నేస్ హామిల్టన్ (56) పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని లోఖండ వాలాలో డాన్స్ క్లాసులు నిర్వహించే ఆమె వ్యభిచారం నిమిత్తం విదేశాలకు యువతులను తరలిస్తోందన్న ఆరోపణలపై ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం డాన్స్ అకాడమిని నిర్వహిస్తున్న ఆగ్నేస్ డ్యాన్స్ క్లాసులు పేరుతో అమ్మాయిలకు ఎరవేస్తుంది. ఆ తరువాత విదేశాల్లో, బార్లలో డాన్స్ చేస్తే ఎక్కువ డబ్బులొస్తాయంటూ మభ్యపెడుతుంది. అనంతరం వారిని వ్యభిచారంలోకి బలవంతంగా దించుతోంది. ఇలా కెన్యా, బహ్రెయిన్ దుబాయికి అమ్మాయిలను తరలిస్తుంది. ముఖ్యంగా ఇలా ఒక యువతిని తరలిస్తుండగా ఆమె క్రైం బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించడంతో ఆమె బండారం బట్టబయలైంది. కెన్యా హోటల్‌లో ఉద్యోగమంటూ సదరు యువతిని కెన్యాకు తరలించగా, అక్కడ రజియా పటేల్ అనే మరోవ్యక్తి (హామిల్టన్ ఏజంట్) ఆమెను నైరోబికి తీసుకెళ్లాడు. అక్కడ వ్యభిచారం చేయాల్సిందిగా బలవంతం చేయడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది.
యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేశామని క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ దిలీప్ సావంత్ తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఇండియా మలేషియా మధ్య చక్కర్లు కొడుతూ విదేశీ వ్యభిచార రాకెట్‌ను గతకొన్నేళ్లుగా నిర్వహిస్తోందని విచారణ అధికారి ఒకరు చెప్పారు. అంతేకాదు ఈ విషయాలను ఎవరికైనా చెబితే మత్తుమందుల కేసులో ఇరికిస్తానని కూడా బెదిరిస్తుందట. ఇలా విదేశాలకు పంపిన ప్రతి యువతికి 40వేల రూపాయలు తీసుకుంటుందట.
Comments
Please login to add a commentAdd a comment