Dance Academy
-
'చీర్ అప్ భారత్' పోస్టర్ ఆవిష్కరించిన చిన్న జీయర్ స్వామి
హైదరాబాద్ : ఈనాటి సమాజంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా వారి వారి పనుల ఒత్తిడి వల్ల మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతూ సంతోషకరమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు. కేవలం కళల ద్వారానే ఈ పరిస్థితి నుంచి బయటపడటం సాధ్యమవుతుందని భావించి సిరిమువ్వ ఆర్ట్స్ బృందం వారు 'చీర్ అప్ భారత్(invoking inner happiness)' అనే ఒక కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిరిమువ్వ ఆర్ట్స్ వారు 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయస్సు గల వారికి ఉచితంగా నృత్యకళలో శిక్షణ ఇచ్చి వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించి వారికి మెగా డాన్స్ షో ద్వారా కొన్ని వేల మంది ప్రేక్షకుల ముందు నృత్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఐదు సీజన్ల పాటు విజయవంతంగా సాగిన ఈ కార్యక్రమం ఆరో సీజన్లో భాగంగా ఈ రోజు చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా 'చీర్ అప్ భారత్' లోగోను వారి ఆశ్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ మాట్లాడుతూ ఒక మనిషిలోని సంతోషాన్ని బయటకి తీసుకురావడం సాధారణంగా జరిగే పని కాదు కానీ ఒక కళ ద్వారా మాత్రమే ఆ సంతోషాన్ని బయటకు తీసుకురాగలం అన్నారు. ఈ మంచి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మనసారా కోరుకుంటూ ఈ లోగోను నా చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నందుకు సంతోషంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిమువ్వ ఆర్ట్స్ డైరెక్టర్స్ వై. మధుసూదన్ రావు, వై. తులసి, ప్రముఖ అంతర్జాతీయ మెజీషియన్ సామల వేణు, హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, డాన్స్ మాస్టర్ ధావన్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఎస్వీ గోసంరక్షణశాలలో వైభవోపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు -
సింగపూర్ విద్యార్ధులకు శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం నృత్య కోర్సులు
శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం (మహిళా విశ్వవిద్యాలయం) విద్య సంగీతం అకాడమీ (సింగపూర్) లు సంయుక్తంగా సింగపూర్ విద్యార్ధులకు నృత్య కోర్సులను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వైస్ ఛాన్సలర్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్పీఎంవీవీ) అధ్యక్షతన, ఎస్పీఎంవీవీ అంతర్జాతీయ సంబంధాల విభాగానికి చెందిన యూనివర్సిటీ అధికారులు, సింగపూర్‌లోని తెలుగు, భారతీయ సంగీత ప్రియులు రాగవిహారి పేరుతో విద్యార్థుల ప్రదర్శనల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 2గంటల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని భారత్, సింగపూర్ సంగీత ఔత్సాహికులు యూట్యూబ్, సోషల్ మీడియాలో వీక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పద్మావతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జమున దువ్వూరు మాట్లాడుతూ..మహిళా యూనివర్సిటీ తరుపున ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ..ఎస్పీ ఎంవీవీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ డాక్టర్ పి విజయలక్ష్మి, ఎస్పీఎం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ ద్వారం వీజేలక్ష్మి ఈ కొలాబరేషన్ ప్రత్యేకమైన సింగపూర్ శైలిలో జరుగుతోందని, దీన్ని వ్యాప్తి చేసేందుకు విద్యా సంగీతం అకాడమీకి వారి సహకారం పూర్తిగా ఉంటుందని పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో విద్యా సంగీతం అకాడమీ (వీఎస్ఏ) వ్యవస్థాపకురాలు, శ్రీమతి కాపవరపు విద్యాధరి మాట్లాడుతూ, “పలు సంగీత నృత్య కార్యక్రమాలను అందించడానికి సుప్రసిద్ధ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్పీ ఎంవీవీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. సంగీతం (గాత్రం / వాయిద్యం) మరియు నృత్యం (కూచిపూడి / భరతనాట్యం) అలాగే అన్నమయ్య కీర్తనలు మరియు వాగ్గేయకార వైభవం కోసం సర్టిఫికేట్ కోర్సులు కూడా ఈ ఒప్పందం ద్వారా సింగపూర్ లో పిల్లలకు అందిస్తాము. సింగపూర్‌లో మన సంస్కృతిని ప్రచారం చేసేందుకు వీఎస్ఏ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మరో అడుగు. ఎస్ఫీ ఎంవీవీ అధికారులు వారి మద్దతు, సౌలభ్యం మరియు అనేక నెలలపాటు పని చేయడం ద్వారా దీనికి రూపకల్పన చేసినందుకు నేను వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్, చిరకాల సింగపూర్ తెలుగు సమాజం ప్రతినిధులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి ప్రెసిడెంట్ రత్నకుమార్ కవుటూరు ఎస్పీ ఎం వీవీ , వీఎస్ఏ బృందాల ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ సహకారాన్ని "సింగపూర్‌లోని ఎన్ఆర్ఐ విద్యార్థులు సంగీతం నేర్చుకునేందుకు, ఎస్పీ ఎంవీవీ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుండి గుర్తింపు పొందేందుకు ఒక గొప్ప అవకాశం" అని అభివర్ణించారు. మన సంస్కృతి, సంగీతం యొక్క ప్రభావాలను యోగాతో పోల్చుతూ, సింగపూర్ తెలుగు సమాజం వైస్ ప్రెసిడెంట్ జ్యోతేశ్వర్ రెడ్డి కురిచేటి ఈ సహకారాన్ని సంగీతాన్ని ఇష్టపడే పిల్లలందరూ ఆదరించడానికి ఒక ముఖ్యమైన, సంతోషకరమని పేర్కొన్నారు.భారతదేశం నుండి ప్రముఖ వక్త, రంగస్వామి కృష్ణన్ ఇలాంటి సహకారాలు మన దైనందిన జీవితంలో పెరగాలని, సంస్కృతిని వ్యక్తపరచాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బు వి పాలకుర్తి కూడా నిర్వాహకుల కృషిని అభినందించారు. విద్యా సంగీతం అకాడమీ విద్యార్థుల ప్రకటనలు, సందేశాలు, ప్రదర్శనలతో ఒక ప్రత్యేకమైన మిక్స్‌గా జరిగిన ఈ రెండు గంటల కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎందరో వీక్షకులచే ప్రశంసించబడింది. సింగపూర్‌లోని విద్యార్థుల కోసం ఎన్రోల్మెంట్లు తెరిచామని వీఎస్ఏ టీం ధృవీకరించింది. కోర్సు వివరాల,రిజిస్ట్రేషన్ల కోసం ఆసక్తిగల అభ్యర్థులు vidyasangeetam.academy ద్వారా సంప్రదించాలని వీఎస్ఏ ప్రతినిధి విద్యాధరి పేర్కొన్నారు. -
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు : బాలీవుడ్ కొరియో గ్రాఫర్ అరెస్ట్
సాక్షి, ముంబై: ముంబై పోలీసులు అంతర్జాతీయ వ్యభిచార రాకెట్‌ను ఛేధించారు. ఈ కేసులో బాలీవుడ్ కొరియో గ్రాఫర్ ఆగ్నేస్ హామిల్టన్ (56) పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని లోఖండ వాలాలో డాన్స్ క్లాసులు నిర్వహించే ఆమె వ్యభిచారం నిమిత్తం విదేశాలకు యువతులను తరలిస్తోందన్న ఆరోపణలపై ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం డాన్స్ అకాడమిని నిర్వహిస్తున్న ఆగ్నేస్ డ్యాన్స్ క్లాసులు పేరుతో అమ్మాయిలకు ఎరవేస్తుంది. ఆ తరువాత విదేశాల్లో, బార్లలో డాన్స్ చేస్తే ఎక్కువ డబ్బులొస్తాయంటూ మభ్యపెడుతుంది. అనంతరం వారిని వ్యభిచారంలోకి బలవంతంగా దించుతోంది. ఇలా కెన్యా, బహ్రెయిన్ దుబాయికి అమ్మాయిలను తరలిస్తుంది. ముఖ్యంగా ఇలా ఒక యువతిని తరలిస్తుండగా ఆమె క్రైం బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించడంతో ఆమె బండారం బట్టబయలైంది. కెన్యా హోటల్లో ఉద్యోగమంటూ సదరు యువతిని కెన్యాకు తరలించగా, అక్కడ రజియా పటేల్ అనే మరోవ్యక్తి (హామిల్టన్ ఏజంట్) ఆమెను నైరోబికి తీసుకెళ్లాడు. అక్కడ వ్యభిచారం చేయాల్సిందిగా బలవంతం చేయడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేశామని క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ దిలీప్ సావంత్ తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఇండియా మలేషియా మధ్య చక్కర్లు కొడుతూ విదేశీ వ్యభిచార రాకెట్‌ను గతకొన్నేళ్లుగా నిర్వహిస్తోందని విచారణ అధికారి ఒకరు చెప్పారు. అంతేకాదు ఈ విషయాలను ఎవరికైనా చెబితే మత్తుమందుల కేసులో ఇరికిస్తానని కూడా బెదిరిస్తుందట. ఇలా విదేశాలకు పంపిన ప్రతి యువతికి 40వేల రూపాయలు తీసుకుంటుందట. -
డ్యాన్స్ అకాడమీ నెలకొల్పాలని ఆశ
చెన్నైలో డ్యాన్స్ అకాడమీ నెలకొల్పాలని ఉందని నటి విమలా రామన్ పేర్కొన్నారు. పొయ్చిత్రం ద్వారా తెర మీదకు వచ్చిన ఈ మలయాళీ బ్యూటీ ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా, నిలదొక్కుకోలేక పోయింది. అటుపై టాలీవుడ్లో అందాలను ఆరబోసినా ఫలితం లేదు. ప్రస్తుతం మలయాళం, కన్నడం భాషలపై దృష్టి పెట్టారు. భారత నాట్యంలో ప్రావీణ్యం పొందిన విమలా రామన్ త్వరలో చెన్నైలో డ్యాన్స్ అకాడమీ నెలకొల్పే యోచనలో ఉన్నారు. ఈ విషయమై ఆమె పేర్కొంటూ, మయూరి, సాగర సంగమంలాంటి కొన్ని సంగీత భరిత చిత్రాలను చూసి స్ఫూర్తి పొందినట్టు తెలిపారు. స్వతహాగా నృత్య కళాకారిణి కావడంతో ఆ చిత్రాలు తనకు క్యాష్నెట్గా మారాయన్నారు. దేశ విదేశాల్లో 200కు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చానన్నారు. ఈ మధ్య సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ ఓపెనింగ్ రోజున తన నృత్య కార్యక్రమం జరిగిందని తెలిపారు. త్వరలో చెన్నైలో నృత్య అకాడమీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కన్నడంలో పొన్ కుమరన్(లింగ చిత్ర కథరచయిత) దర్శకత్వంలో రాజా రవీంద్ర చిత్రంలో నటిస్తున్నట్టు తెలిపారు. ఇది 1920లో జరిగిన యథార్థ గాథకు నిదర్శనంగా వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో తనది రాయల్ ఫ్యామిలీకి చెందిన యువతి పాత్రగా పేర్కొన్నారు. ఈ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందన్నారు. అదే విధంగా మలయాళంలో టర్నింగ్ పాయింట్ చిత్రంలో నటిస్తున్నట్టు పేర్కొన్నారు.