ప్రతీకాత్మక చిత్రం
Warangal: హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి నిర్వహించి ఇద్దరు నిర్వాహకులతో పాటు ఒక విటుడిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు.
కొత్తురుజెండాలో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం జరుగుతుందని ఆయన తెలిపారు. నిర్వాహకులు కొత్తురుజెండాకు చెందిన ప్రీతి ఉపాధ్యాయ, ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన బండి సురేష్, విటుడు వరంగల్ కొత్తవాడకు చెందిన మామిడి విద్యాసాగర్‌ను అరెస్ట్ చేసి హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment