
వ్యభిచారం రాకెట్‌లో బ్యూటీక్వీన్ అరెస్టు
వియత్నాం పోలీసులు ఒక హోటల్ మీద దాడి చేసి హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్‌ను పట్టుకున్నారు. అందులో కొంతకాలం క్రితం అందాల పోటీలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన ఓ యువతి కూడా ఉండటం పోలీసులకే షాకిచ్చింది. ఉత్తరాది రాష్ట్రమైన క్వాంగ్ నిన్ ఇద్దరు పురుషులతో కలిసి ఉండగా హోటల్ గదిలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితురాలు అయిన ట్రాన్ డక్ తుయ్ లియెన్ 2014లో నిర్వహించిన యూనివర్సిటీ అందాల పోటీలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ కేసులో పట్టుబడటంతో ఆమెకు మూడున్నరేళ్ల జైలుశిక్ష విధించారు. ఆమె అసిస్టెంట్ అయిన డోన్ ఎన్‌గాక్ మిన్‌కు రెరండు సంవత్సరాల మూడు నెలల జైలుశిక్ష పడింది.
లియెన్, మిన్ ఇద్దరూ తాము ఈ అక్రమ వ్యవహారం ద్వారా సంపాదించిన దాదాపు 2 లక్షల రూపాయలను తమకు స్వాధీనం చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. వీళ్లిద్దరూ హో చి మిన్ నగరం నుంచి క్వాంగ్ నిన్ నగరానికి టాక్సీలో వెళ్లినట్లు తెలిసింది. వాళ్లిద్దరూ కూడా రెండు రోజుల పాటు హోటల్ గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ రాకెట్‌లో మరింతమంది మోడళ్లు, బ్యూటీ క్వీన్‌లు ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.