
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహాన్ని నడుపుతున్న నిర్వాహకుడితో పాటు మరో ఇద్దరిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్‌లోని లిటిల్ రాక్ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచార గృహం నడుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. మెదక్ జిల్లా కాజీపల్లికి చెందిన విజయ్‌కుమార్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
అతనితో పాటు మెదక్ జిల్లా శంకరంపేట్‌కు చెందిన అభిలాష్, మచ్చబొల్లారానికి చెందిన మహిళను(20) అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా వ్యభిచార గృహం నడుపుతున్నట్లు తెలిపారు. విజయ్‌కుమార్, అభిలాష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహిళను మెమోరియల్ ట్రస్ట్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (భార్య, భర్త.. మధ్యలో ప్రియుడు..క్రైమ్ కథా చిత్రమ్)
Comments
Please login to add a commentAdd a comment