
చిక్కడపల్లి: చిక్కడపల్లిలోని సాయికృప హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండగా చిక్కడపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సంఘటనలో మేనేజర్ బి.ఉషశ్రీ (22) సహా హోటల్‌లో హౌస్‌కీపర్లుగా పని చేస్తున్న ఇ.శ్రీకాంత్ (24), కె.సాయికుమార్(23)లను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి మూడు ఖరీదైన సెల్‌ఫోన్లు, 10 నిరోధ్ ప్యాకెట్లు, రూ.8 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇన్‌స్పెక్టర్ పాలడుగు శివశంకర్‌రావు వివరాల ప్రకారం.. సులువుగా డబ్బు సంపాదించేందు కోసం సూర్యపేటకు చెందిన ఉషశ్రీ సాయికృప హోటల్‌లోని 205 నంబర్ గదిని అద్దెకు తీసుకుని వివిధ ప్రాంతాలకు చెందిన సెక్స్‌వర్కర్లను రప్పించి వారికి వచ్చే ఆదాయంలో ఫిఫ్టీ షేరింగ్‌తో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. హోటల్‌లో హౌస్‌కీపింగ్ జాబ్ చేస్తున్న సిద్ధిపేటకు చెందిన శ్రీకాంత్, నల్గొండకు చెందిన సాయికుమార్‌లు ఆమెకు సహకరించేవారు.మధ్యవర్తులుగా వ్యవహరించిన విష్ణు, ధర్మాలు పరారీలో ఉన్నారు. సీసీఎస్ పోలీసుల విశ్వసనీయ సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం రాత్రి హోటల్‌పై దాడులు నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment