Mumbai Actress Arrested For Running Prostitution Racket: Details Inside - Sakshi
Sakshi News home page

సెక్స్‌ రాకెట్‌: టాప్‌ మోడల్‌, నటి అరెస్ట్‌

Published Sat, Aug 21 2021 10:48 AM | Last Updated on Sat, Aug 21 2021 3:05 PM

Police Held Mumbai Model Who Running Prostitution Racket In Star Hotel - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఓ స్టార్‌ హోటల్‌లో గుట్టుగా సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్న ఓ మహిళను ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు. జూహులోని ఓ 5 స్టార్‌ హోటల్‌లో పలువురు టీవీ నటులు, మోడల్‌తో ఆమె ఈ రాకెట్‌ను నడిపిస్తున్నట్లు తెలిసింది. అరెస్టయిన సదరు మహిళను టాప్‌ మోడల్‌, టీవీ నటిగా పోలీసులు గుర్తించారు. లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోవడంతో వ్యభిచారం నడుపుతున్నట్టు ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. కాగా సదరు మోడల్‌ పేరు ఇషా ఖాన్‌గా సమాచారం. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు సమాచారం ప్రకారం..  జూహులోని 5 స్టార్‌ హోటల్‌లో సదరు మోడల్‌ సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

చదవండి: పాయల్‌ రాజ్‌పుత్‌పై కేసు నమోదు 

దీంతో కస్టమర్లుగా ఇషాఖాన్‌కు పోలీసులు ఫోన్‌ చేశారు. దీంతో వారితో గంటకు ఒక్కరికి రూ. 2 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసింది. ఈ  ఒప్పందం కుదరడంతో ఆమె పోలీసులకు కొంతమంది అమ్మాయిల ఫొటోలను వాట్సప్‌లో పంపించింది. ఆ తర్వాత వారిని కలుసుకోవడానికి జూహులోని ఓ స్టార్‌ హోటల్‌కు రావాల్సిందిగా ఆమె చెప్పింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు హోటల్‌కు వెళ్లిన పోలీసులు సదరు మోడల్‌తో పాటు మరో ఇద్దరూ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో ఈ వృత్తిలోకి దిగినట్లు చెప్పారు. అనంతరం ఈ రాకెట్‌ నడుపుతున్న ఇషాఖాన్‌పై పోలీసులు సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి మరోఇద్దరి అమ్మాయిలను పునరావస కేంద్రాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement