
సాక్షి, గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ఆర్‌ఎంపీ వైద్యం చేస్తూ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న మహిళపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భవానీపురం స్వాతిరోడ్‌కు చెందిన రామటెంకి రాధిక భర్త ఆర్‌ఎంపీగా చేస్తూ కరోనాతో మృతి చెందాడు.
అప్పటి నుంచి ఆమె ఇంటి వద్దనే వైద్యం చేస్తోంది. దాంతో పాటు వాట్సాప్ ద్వారా పార్టీలను బుక్ చేసుకుని వారికి అమ్మాయిలను పంపిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఓ వ్యక్తి రూ.10వేలకు ఓ అమ్మాయిని బుక్ చేసుకున్నాడు. అతనిని గొల్లపూడి స్కూల్ వద్దకు రమ్మని అతని నుంచి రూ.5వేలు తీసుకుని, మిగిలిన డబ్బులు యువతికి ఇవ్వమని ఒప్పందం కుదుర్చుకుంది.
స్కూల్ సమీపంలోని బే లీవ్స్ హోటల్‌లో రూమ్ నంబరు 101 లో ఉన్న ఆ యువతి వద్దకు అతనిని పంపింది. సమాచారం తెలుసుకున్న భవానీపురం సీఐ ఒమర్ సిబ్బందితో హోటల్‌కు వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం చేయిస్తున్న రాధికను అరెస్ట్ చేశారు. బాధితురాలిని హోమ్‌కు తరలించారు.
చదవండి: (Hyderabad: మెకానిక్‌తో వచ్చి.. రహస్య కెమెరా అమర్చి!)
Comments
Please login to add a commentAdd a comment