వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ముంబై, గుజరాత్‌ల నుంచి అమ్మాయిలను.. | Prostitution Racket Busted in Thane Maharashtra | Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ముంబై, గుజరాత్‌ల నుంచి అమ్మాయిలను తెచ్చి..

Published Sat, Jul 16 2022 1:17 AM | Last Updated on Sat, Jul 16 2022 1:17 AM

Prostitution Racket Busted in Thane Maharashtra - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లనుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచార ముఠాను గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నాడు.

ముంబై: గుట్టు చప్పుడు కాకుండా థానె పట్టణంలో వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని థానె పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన బిలాల్‌ కొకాన్‌ మోరల్‌ (26) అనే వ్యక్తి థానె, ముంబై, నవీ ముంబై, పుణె, చెన్నై, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లనుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచార ముఠాను గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నాడు.

ఈ సమాచారాన్ని అందుకున్న థానెలోని మానవ అక్రమరవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టీసీ) పోలీసులు వలపన్ని బిలాల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటుగా మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం థానెలోని కోప్రీ పోలీసు స్టేషన్‌లో బిలాల్‌ను ఉంచి మరింత సమాచారాన్ని పోలీసులు రాబట్టేందుకు విచారణ చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement