
వ్యభిచారం కేసులో పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్ట్
బోడుప్పల్: గుట్టు చప్పుడు కాకుండా ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌వోటీ సీఐ నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సైనిక్‌పురి ఆర్కేపురానికి చెందిన మరో యువతి(28), యూసుఫ్‌గూడ మధురానగర్‌లోని ఓ హాస్టల్‌లో నివసించే జూనియర్ ఆర్టిస్ట్(27), అదే కాలనీలో ఉండే మేకప్‌మెన్ కె.బండారి (23) ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
లోకేట్ అనే వెబ్‌సైట్‌లో ఒక విటుడిని బుక్ చేసుకొని బోడుప్పల్‌లోని ఎన్‌టీఆర్ విగ్రహం దగ్గర అప్పగించడానికి ఓ యువతిని తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి బండారితో పాటు ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1700 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని అనంతరం మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.