
హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని చనిపోయిందంటూ మృతదేహంతో ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు, విద్యార్థి యువజన సంఘాలు ధర్నాకు దిగాయి.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ మండలం బూరుగూడ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో సంగీత అనే డిగ్రీ విద్యార్థిని జ్వరంతో ప్రాణాలు కోల్పోయింది. కరీంనగర్‌లో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని చనిపోయిందంటూ మృతదేహంతో ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు, విద్యార్థి యువజన సంఘాలు ధర్నాకు దిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురు విద్యార్థినిలు జ్వరంతో మృతిచెందిన అధికారులు చర్యలు చేపట్టడం లేదని అధికారుల తీరుపై గిరిజనులు మండిపడుతున్నారు.
చదవండి: భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్ జెండర్‌ని ఇంటికి రప్పించి...