ఒకేరోజు ఒక్కటైన 111 జంటలు | MLA Konappa Performs Mass Marriage Of 111 Couples | Sakshi
Sakshi News home page

ఒకేరోజు ఒక్కటైన 111 జంటలు

Published Mon, Feb 7 2022 4:37 AM | Last Updated on Mon, Feb 7 2022 1:37 PM

MLA Konappa Performs Mass Marriage Of 111 Couples - Sakshi

పెంచికల్‌పేట్‌(ఆదిలాబాద్‌): మూడు ముళ్లు.. ఏడడుగులతో అగ్ని సాక్షిగా 111 జంటలు ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ మండలంలో ఆదివారం ఏకమయ్యాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు కోనేరు చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప–రమాదేవి దంపతులు సామూహిక వివాహాలు జరిపించారు. జయమంగళ నది (పెద్దవాగు) తీరాన శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకకు కోనేరు కోనప్ప దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.

వధూవరులకు తాళి బొట్టు, మెట్టెలు, పట్టు వస్త్రాలు, వంట సామగ్రి అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్‌ రాహుల్‌రాజ్, ఎస్పీ సురేశ్‌కుమార్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement