
కెరమెరి (ఆసిఫాబాద్): హస్తకళ కళాకారుడు, కుమురంభీం జిల్లా కెరమెరి మండలం కేస్లాగూడకు చెందిన కోవ న్యానేశ్వర్ (70) అనారోగ్యంతో కన్నుమూశారు. ఐదురోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు బుధవారం ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండ టంతో కుటుంబసభ్యులు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అ క్కడి వైద్యులు ఆదిలాబాద్‌కు రిఫర్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆయన తుదిశ్వాస విడి చారు. న్యానేశ్వర్‌కు భార్య తుర్సాబాయి,. కొడుకులు భూమేశ్, రాంచందర్, కాశీరాం, కుమార్తె సక్కుబాయి ఉన్నారు. గురువారం కేస్లాగూడలో అంత్యక్రియలు జరగనున్నాయి.
జాతీయస్థాయిలో గుర్తింపు
హస్తకళల్లో న్యానేశ్వర్ జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 2016, నవంబర్ 9న ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘శిల్పిగురు’ అవార్డును అం దుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన సంప్ర దాయ డోక్రీ లోహకళలో న్యానేశ్వర్‌ది అందెవేసిన చేయి. లోహకళలో ఆయన ప్రదర్శించే నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు కేస్లాగూడకు వచ్చేవారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పొందిన గౌరవానికి చిహ్నంగా ఐటీడీఏ అధికారులు కేస్లాగూడ ఆశ్రమ పాఠశాలను అప్పట్లో న్యానేశ్వర్ లోహకళ తయారీ కేంద్రంగా మార్చారు. గోండీ ఆదివాసీ డోక్రీ కళకు కొత్త శైలిని జోడించి, సృజ నాత్మక కళాఖండాలు సృష్టించిన న్యానేశ్వర్ చిరస్మరణీయుడని కవి, రచయిత జయధీర్ తిరుమలరావు సంతాపం తెలిపారు. ఆయన భార్యకు పింఛన్‌ఇవ్వాలని తెలంగాణ హస్తకళల అధ్యయన వేదిక అధ్యక్షుడు డాక్టర్ పృథ్వీరాజ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment