kerameri mandal
-
కళ్ల ‘కలక’లం
ఆదిలాబాద్: కెరమెరి మండలంలోని అనార్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆరురోజుల క్రితం ఇద్దరు విద్యార్థులకు కళ్ల కలక వ్యాధి సోకింది. పరీక్షించిన పీహెచ్సీ వైద్యాధికారి వినోద్‌కుమార్ వైద్యం చేసి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి పంపించారు. శనివారం అదే ఆశ్రమ పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించగా 11 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో ఆ పాఠశాలలో కలకలం రేగింది. ఈ ఒక్క పాఠశాలనే కాదు జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో విద్యార్థులు, చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కళ్ల కలక (కంజెక్టివైటీస్) వ్యాధి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వ్యాపించింది. ముఖ్యంగా చిన్నారులకు అధికంగా సోకుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 213 కేసులు నమోదయ్యా యి. దగ్గు జలుబు, మాదిరి సీజనల్లాగా వచ్చే వ్యాధి. వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రభా వం చూపుతుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వ్యాపించింది. ఎక్కువగా చిన్నారులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి సోకిన వారి కళ్లను తదేకంగా చూడడం వల్ల కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయితే రోగిని ప్రత్యేక గదిలో ఉంచాలి. రోగి వాడిన టవల్, ఇతర వస్తువులు ఇతరులు ఉపయోగించకూడదు. పెద్ద ప్రమాదం ఏమీ లేకపోయినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాధి లక్షణాలు వ్యాధి సోకిన వారి కళ్లు మంట అనిపిస్తాయి. కళ్లవెంట నీరుకారడం, దురద, రెప్పలు వాపెక్కడం, ఊసులురావడం, నిద్రపోయిన సమయంలో రెప్పలు అతుక్కోవడం కళ్ల కలక లక్షణాలు. ఒక కన్నుతో మొదలై మరోకంటికి వ్యాపిస్తుంది. ఒకరితో మొదలై ఏకకాలంలో పలువురికి వ్యాప్తి చెందుతుంది. రోగ నిరోధకశక్తి ఆధారంగా మూడు నుంచి వారం రోజుల పాటు వేధిస్తుంది. వాతావరణం ఒక్కసారిగా మారడంతో వ్యాధి ప్రభావం అధికంగా చూపుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాధి సోకిన వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. రోగి టవల్, సబ్బు ఇతరులు వాడవద్దు. బయటికి వెళ్లినప్పుడు నల్ల కళ్లద్దాలు పెట్టుకోవాలి. ఇతరులకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు సోకితే వ్యాధి తగ్గేవరకూ ఇంటివద్దే ఉండాలి. వైద్యుల సూచనలతో యాంటీబయాటిక్స్ డ్రాప్స్ వాడాలి. ఆందోళన చెందవద్దు కళ్ల కలక వ్యాధి సోకినవారు ఆందోళన చెందవద్దు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధికి సంబంధించిన డ్రాప్స్ అందుబాటులో ఉన్నాయి. వ్యాధి సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలి. రోగి కళ్లల్లోకి చూసినా అతను వాడిన టవల్ ఉపయోగించినా ఇతరులకు వ్యాధి సోకే ప్రమాదం ఉంది. – రామకృష్ణ, జిల్లా వైద్యాధికారి -
హస్తకళ కళాకారుడు న్యానేశ్వర్ కన్నుమూత
కెరమెరి (ఆసిఫాబాద్): హస్తకళ కళాకారుడు, కుమురంభీం జిల్లా కెరమెరి మండలం కేస్లాగూడకు చెందిన కోవ న్యానేశ్వర్ (70) అనారోగ్యంతో కన్నుమూశారు. ఐదురోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు బుధవారం ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండ టంతో కుటుంబసభ్యులు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అ క్కడి వైద్యులు ఆదిలాబాద్‌కు రిఫర్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆయన తుదిశ్వాస విడి చారు. న్యానేశ్వర్‌కు భార్య తుర్సాబాయి,. కొడుకులు భూమేశ్, రాంచందర్, కాశీరాం, కుమార్తె సక్కుబాయి ఉన్నారు. గురువారం కేస్లాగూడలో అంత్యక్రియలు జరగనున్నాయి. జాతీయస్థాయిలో గుర్తింపు హస్తకళల్లో న్యానేశ్వర్ జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 2016, నవంబర్ 9న ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘శిల్పిగురు’ అవార్డును అం దుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన సంప్ర దాయ డోక్రీ లోహకళలో న్యానేశ్వర్‌ది అందెవేసిన చేయి. లోహకళలో ఆయన ప్రదర్శించే నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు కేస్లాగూడకు వచ్చేవారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పొందిన గౌరవానికి చిహ్నంగా ఐటీడీఏ అధికారులు కేస్లాగూడ ఆశ్రమ పాఠశాలను అప్పట్లో న్యానేశ్వర్ లోహకళ తయారీ కేంద్రంగా మార్చారు. గోండీ ఆదివాసీ డోక్రీ కళకు కొత్త శైలిని జోడించి, సృజ నాత్మక కళాఖండాలు సృష్టించిన న్యానేశ్వర్ చిరస్మరణీయుడని కవి, రచయిత జయధీర్ తిరుమలరావు సంతాపం తెలిపారు. ఆయన భార్యకు పింఛన్‌ఇవ్వాలని తెలంగాణ హస్తకళల అధ్యయన వేదిక అధ్యక్షుడు డాక్టర్ పృథ్వీరాజ్ కోరారు. -
నాగల్‌గొంది.. తీరిన రంది
కెరమెరి: ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి వా రు అనుభవిస్తున్న కష్టాలు ఎట్టకేలకు దూరమయ్యాయి. కెరమెరి తహసీల్దార్ ప్రమోద్ ప్రత్యేక చొరవ తీసుకుని ఉన్న గ్రామంలోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో అక్కడి ఓటర్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్ల తర్వాత అక్కడి ఆదివాసీలకు ఎట్టకేలకు స్వాతంత్య్రం సిద్ధించినట్లు భావిస్తున్నారు. ఏళ్ల కష్టాలు దూరం.. మండలంలోని కరంజివాడ గ్రామ పంచాయతీ లోని నాగల్‌గొంది, కొలాంగూడ గ్రామాల్లో 379 జనాభా ఉంది. అందులో పురుష ఓటర్లు 113 కా గా.. మహిళలు 106 మొత్తం 219 ఓటర్లు ఉన్నా రు. వారు గత కొన్ని సంవత్సరాలుగా ఇందాపూర్, లేదా నిషాని గ్రామంలోని పోలింగ్ బూత్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేవారు. 70 ఏళ్లలో ఇప్పటికి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వారికి కష్టాలు తప్పలేదు. ఇందాపూర్‌కు వెళ్లాలంటే 15 కిలోమీ టర్లు కాగా, నిషాని గ్రామం 18 కిలోమీటర్ల దూ రంలో ఉంది. ఈ నేపథ్యంలో ఏ కాలంలో ఏ ఎన్ని కలు జరిగిన వారు పాదయాత్రగా వెళ్లక తప్పలే దు. చాలా సందర్భాల్లో వానకు తడుస్తూ, ఎండ కు ఎండుతూ.. చలికి వణుకుతూ వెళ్లి ఓట్లు వేశా రు. ఎన్నికలు జరిగిన ప్రతీ సారి వారు దూరభా రం అధికమవుతుందని దగ్గర్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అక్కడి ఓటర్లు కోరినప్పటికి అధికారులు పట్టించుకోలేదు. పోలింగ్ కేంద్రాల మార్పు రెవెన్యూ అధికారుల చేతుల్లో ఉన్నప్పటికి మనకెందుకులే అనుకున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు ఓటు వేసేందుకు కష్టాలు చవిచూశారు. సాక్షి, తహసీల్దార్ ప్రత్యేక చొరవ ఈ విషయమై డిసెంబర్ 7న సాక్షి దినపత్రికలో ‘ఓట్ల కోసం తప్పని పాట్లు’ అనే కథనం ప్రచురి తం కావడంతో పాటు ఆ ప్రాంత ప్రజలు కెరమెరి తహసీల్దార్ ప్రమోద్ను వేడుకున్నారు. దీంతో స్పందించిన తహసీల్దార్ అక్కడి ఓటర్లు, జనాభా తదితరాల వివరాలను సేకరించారు. అక్కడి ఓట ర్లు ఓటు వేసేందుకు ఇబ్బందులు పడుతున్న విష యం వాస్తవమేనని గ్రహించిన ప్రమోద్‌కుమార్ వెంటనే నాగల్గొందిలోనే పోలింగ్ కేంద్రం ఏర్పా టు చేశారు. నేడు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు వారు నాగల్‌గొంది గ్రామంలో ఏర్పాటు చేసిన పో లింగ్ బూత్ సంఖ్య 90లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దూరభారం తగ్గింది చాలా కాలంగా ఓట్లు వేయడానికి పడుతున్న కష్టం ఎట్టకేలకు ముగిసింది. ఇక చక్కగ తమ గ్రామంలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రెవెన్యూ అధికారులు కల్పించారు. సరైన రోడ్డు సౌకర్యం లేక , దూరభారం అధికంగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. – మధుకర్ సర్పంచ్, నాగల్‌గొంది ఓటర్ల బాధలు చూసి.. ఓటర్లు టు వేసేందుకు పడుతున్న బాధనలు చూ సి వారు ఉండే గ్రామంలోనే పోలింగ బూత్ కేంద్రం ఏర్పాటు చే యాలని భావించాం. వెంటనే అధికారులకు నివేదికలు సమర్పించండంతో అక్కడ నూతనంగా పోలింగ్ బూత్ కేంద్రం మంజూరైంది. దీనికి ‘సాక్షి’ కూడా తోడైంది. ప్రజల బాధలు తీరాయి. దూరభారం తగ్గింది. – వి.ప్రమోద్, తహసీల్దార్ -
ఓట్లేనా.. సమస్యలు పట్టవా..?
కెరమెరి : రెండు రాష్ట్రాలు. ఇటు తెలంగాణ.. అటు మహారాష్ట్ర. ఈ రెండు ప్రభుత్వాలు సరిహద్దులో ఉన్న కెరమెరి మండలంలోని వివాదాస్పద 14 గ్రామాలను ఏళ్ల తరబడి పాలిస్తున్నాయి. అయినా ఆయా గ్రామాల ప్రజల కష్టాలు తీరడంలేదు. తాగునీరు, రోడ్లు, రవాణా తదితర సౌకర్యాలకు నోచుకోవడంలేదు. ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపుతుండడంతో ఏ గ్రామాన్ని కదిలించినా కన్నీటి గాథలే. ఎన్నికల వేళ వాగ్దానాలు గుప్పించి ఇరు ప్రభుత్వాలు ఓట్లు వేయించుకుంటున్నాయే తప్ప గ్రామాల అభివృద్ధి.. ప్రజల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. బుధవారం మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజూరా నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా గ్రామాల సమస్యలపై..14 గ్రామాలు.. కెరమెరి మండలం పరందోళి, అంతాపూర్ పంచాయతీల పరిధిలోని పరందోళి, కోటా, పరందోళి తండా, ముకద్దంగూడ, మహరాజ్‌గూడ, లేండిజాల, అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఎసాపూర్, నారాయణగూడ, బోలాపటార్, లేండిగూడ, గౌరి గ్రామాలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఈ గ్రామాల్లో సుమారు నాలుగు వేల జనాభా, 2658 మంది ఓటర్లున్నారు. ఈ 14 గ్రామాలు మహారాష్ట్రలో రాజూరా నియోజకవర్గ పరిధిలోకి.. తెలంగాణలో ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్ 10న మహారాష్ట్రలో ఎంపీ ఎన్నికలు జరగగా.. 11న కెరమెరి మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఆయా గ్రామస్తులు ఇరు ప్రభుత్వాలకూ ఓట్లు వేశారు. ఐదు నెలల తర్వాత మళ్లీ మహారాష్ట్రలో బుధవారం జరిగే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధమవుతున్నారు. అభివృద్ధి అంతంతే.. ఆయా గ్రామాలకు రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీ సభ్యు లు ఉన్నారు. ప్రతీ కుటుంబం రెండేసి రేషన్‌కార్డులు, ప్రతిఒక్కరూ రెండేసి ఓటరు కార్డు లు కలిగి ఉన్నారు. పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు రెండేసి ఉన్నాయి. ఇరు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అవి వారి దరిచేరడంలేదు. ఏ గ్రామానికి రోడ్డు, రవాణా సౌకర్యం లేదు. అనేక గ్రామాల్లో తాగునీటి పథకాలు పని చేయడంలేదు. భూగర్భజలాలు ఇంకిపోతుండడంతో చేతిపంపులు నిరుపయోగంగా మారాయి. జనం దాహార్తితో అల మటిస్తున్నారు. కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి ఊటబావులు, చెరువుల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. నేటికి ఆయా గ్రా మాలకు వెళ్లాలంటే పిల్లదారులు, కచ్చారోడ్లే శరణ్యం. చాలా గ్రామాల్లో ఇందిరమ్మ గృహా లు మంజూరు కాలేదు. పరందోళిలో కొందరి కి మంజూరైనా దళారులు ఇల్లు నిర్మించకుం డానే లబ్ధిదారులకు తెలవకుండా బిల్లులు స్వాహా చేశారు. ఏళ్లుగా భూములు సాగు చేస్తున్నా పట్టాలు మాత్రం ఇవ్వడంలేదు. విద్యుత్ ఉన్నా లేనట్లే.. ఆయా గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం ఉన్నా లేనట్లే. లేండిగూడలో మూడేళ్ల క్రి తం మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్ప్ఫార్మర్కు నేటికీ కనెక్షన్ ఇవ్వలేదు. కెరమెరి నుం చి విద్యుత్ సరఫరా ఉన్నా నెల లో వారం రోజులైనా కరెంటు ఉండదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇక రాత్రివేళ వారి కష్టాలు వర్ణనాతీతం. అయినా బిల్లులు మాత్రం ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇద్దరే అభ్యర్థుల ప్రచారం ఆయా గ్రామాలకు చెందిన రాజూరా నియోజకవర్గం నుంచి 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఇప్పటి వరకు ఇద్దరు అభ్యర్థులే ఆయా గ్రామాల్లో ప్రచారం చేశారని, మిగతా అభ్యర్థుల తరఫున వారి కార్యకర్తలే ప్రచారం నిర్వహించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇకనైనా నాయకులు తమ కష్టాలు తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.