పింఛన్లు రెగ్యులర్‌గా ఇవ్వాలి | physically challenged persons protest at collectorate | Sakshi
Sakshi News home page

పింఛన్లు రెగ్యులర్‌గా ఇవ్వాలి

Published Tue, Feb 20 2018 3:29 PM | Last Updated on Tue, Oct 16 2018 3:15 PM

physically challenged persons protest at collectorate - Sakshi

ధర్నా నిర్వహిస్తున్న దివ్యాంగులు

మెదక్‌ మున్సిపాలిటీ : వికలాంగులకు ప్రతినెల పింఛన్లు రెగ్యులర్‌గా ఇవ్వాలని, జీఓ నెం.01 అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని వికలాంగుల హక్కుల వేదిక(ఎన్‌పీఆర్డీ) రాష్ట్ర కార్యదర్శి ఎం. అడివయ్య పేర్కొన్నారు. వికలాంగుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరెట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో మొత్తం 20వేల మంది వికలాంగులున్నారని, అందులో 11,656 మందికి మాత్రమే పింఛన్లు వస్తున్నాయన్నారు. మిగతా వారికి సదరం సర్టిఫికెట్లు లేకపోవడంతో పింఛన్లు అందడం లేదన్నారు.  వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు అందజేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

అలాగే ప్రభుత్వ పథకాల్లో సరైన న్యాయం జరగడం లేదన్నారు. డబుల్‌బెడ్‌రూంలు, బస్‌పాస్‌లు, అంత్యోదయకార్డులు, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ వంటి వాటిని పరిష్కరించడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామన్నారు. అనంతరం జేసీ నగేశ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. వీరి ధర్నాకు మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. వికలాంగుల సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరికి లేఖరాసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.  కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు యశోధ, జిల్లా నాయకులు ముత్యాలు, కవిత, విజయ్‌కుమార్, దుర్గ, బస్వరాజ్, శ్రీనివాస్, కృష్ణ, భిక్షపతి, చంద్రం, రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాకార్యదర్శి మల్లేశం వికలాంగులు  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement