GO No. 1
-
ఏపీ: జీవో నంబర్-1పై సుప్రీంకోర్టు కీలక సూచన
సాక్షి, ఢిల్లీ: జీవో నంబర్-1పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కాగా, విచారణ సందర్బంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జోవో నంబర్-1పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ త్వరగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తుది తీర్పు త్వరగా ఇచ్చేలా హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. కాగా, ఏపీలో ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో-1 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీవో నంబర్-1పై విపక్షాలు హైకోర్టులో సవాల్ చేశాయి. దీంతో, జనవరి 24న విచారణ ముగించి ఏపీ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇక, హైకోర్టులో తీవ్ర జాప్యం నేపథ్యంలో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
జీవోనెం.1పై వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. మంగళవారం వాదనలు పూర్తికావడంతో.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. ఇక జీవో నెంబర్ 1 పై సస్పెన్షన్‌ను కొనసాగించాలని టీడీపీ తరపు న్యాయవాది.. హైకోర్ట్ బెంచ్‌ను కోరారు. అయితే అందుకు ధర్మాసనం నిరాకరించింది. అంతకు ముందు రోజు వాదనల సందర్భంగా.. చీఫ్ జస్టిస్, వెకేషన్ బెంచ్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే.. రోడ్‌షోల మీద, ర్యాలీల మీద సర్కార్ ఎలాంటి నిషేధం విధించలేదని, నడి రోడ్డు మీద భారీగా జనాన్ని సమీకరించవద్దని మాత్రమే చెప్పిందని, ప్రజా రక్షణకు సంబంధించి ప్రభుత్వానికే పూర్తి అధికారమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని హైకోర్టు సీజే గుర్తు చేశారు. అలాగే.. చంద్రబాబు సభల్లో 8 మంది చనిపోయిన దృష్ట్యా సర్కారు జీవో తెచ్చిందని ప్రస్తావించారు. -
ప్రభుత్వం ఏ బహిరంగ సభను అడ్డుకోలేదు: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 పూర్తిగా ప్రజా ప్రయోజనమైందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ సందర్భంగా.. వాద ప్రతివాదనల తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలను ఓసారి పరిశీలిస్తే.. ‘‘ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1 ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించినది.పూర్తిగా ప్రజా ప్రయోజనమైందని న్యాయస్థానం భావిస్తోంది. అలాగే.. నడి రోడ్డుపై మీటింగ్ పెట్టడానికి ఎవరికీ హక్కు లేదు. నిజానికి ప్రభుత్వం ఏ బహిరంగ సభను అడ్డుకోలేదు. నడి రోడ్డు మీద కాదు, సౌకర్యమున్న చోట సభ పెట్టుకోమని చెప్పింది అని చీఫ్ జస్టిస్ గుర్తు చేశారు. రోడ్‌షోల మీద, ర్యాలీల మీద సర్కార్ ఎలాంటి నిషేధం విధించలేదని, నడి రోడ్డు మీద భారీగా జనాన్ని సమీకరించవద్దని మాత్రమే చెప్పిందని, ప్రజా రక్షణకు సంబంధించి ప్రభుత్వానికే పూర్తి అధికారమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు సీజే గుర్తు చేశారు. అలాగే.. చంద్రబాబు సభల్లో 8 మంది చనిపోయిన దృష్ట్యా సర్కారు జీవో తెచ్చిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ వేసిన వ్యక్తిలో దురుద్ధేశమేదో కనిపిస్తోందన్న హైకోర్టు సీజే.. ఎనిమిది మంది చనిపోయిన దుర్ఘటనపై విచారణ కమిటీ నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. జీవో నెంబర్ 1ని నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్‌కు సహేతుక కారణాలు లేవని, అలా చేయడమంటే ప్రజల హక్కులు కాలరాసినట్టేనని హైకోర్టు పిటిషనర్‌కు స్పష్టం చేసింది. అది సుప్రీం రూల్స్‌కు విరుద్ధం జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టులో వాద, ప్రతివాదనలు వాడీవేడిగానే సాగాయి. ప్రభుత్వం తెచ్చిన జీవోను పిటిషన్ సవాల్ చేయగా.. ఆ వాదనలను అంతే సమర్థవంతంగా తోసిపుచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలను పరిశీలిస్తే.. ‘‘పిటిషన్‌ను అత్యవసరంగా వెకేషన్ బెంచ్ ముందుకు తేవడాన్ని వ్యతిరేకించాం. చీఫ్ జస్టిస్ వేసిన రోస్టర్‌ను వెకేషన్ బెంచ్ మార్చింది. రోస్టర్‌ను జనవరి 5వ తేదీన రూపొందించి, 6వ తేదీన హడావిడిగా మార్చారు. రోస్టర్‌ను సరైన కారణం లేకుండా మార్చడం సుప్రీంకోర్టు నియామవళికి విరుద్ధం. రోస్టర్ మార్చిన విషయం ప్రతివాదులకు కనీసం చెప్పలేదు. ఈ పిటిషన్లో అత్యవసరం కూడా ఏమీ లేదు. సెలవులు పూర్తయ్యేవరకు వేచి ఉండకుండా ముందే విచారించారు. జనవరి 12న వెకేషన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను మార్చాలి అని వాదనలు వినిపించారు. -
చీఫ్ జస్టిస్ స్థానాన్ని కించపరిచారు!
సాక్షి, అమరావతి: సెలవుల్లో ఎలాంటి అత్యవసర కేసులను విచారించాలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) పరిపాలనాపరంగా నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసినప్పటికీ అందుకు విరుద్ధంగా జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ వ్యవహరించడాన్ని సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. సంక్రాంతి సెలవుల సందర్భంగా వెకేషన్ బెంచ్ వ్యవహరించిన తీరు చాలా దురదృష్టకరమంది. ఆ బెంచ్ డీఫాక్టో ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరించిందని ఆక్షేపించింది. సీజే నిర్దేశించిన ఆదేశాలకు విరుద్ధంగా సెలవుల్లో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించడం ద్వారా సీజే స్థానాన్ని వెకేషన్ బెంచ్ కించపరిచిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రతి వెకేషన్ జడ్జి ఇలాగే వ్యవహరిస్తే వ్యవస్థ ఏమవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిని అనుమతిస్తే రేపు ప్రతి వెకేషన్ జడ్జి ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరిస్తారని వ్యాఖ్యానించింది. ఇది తేలిగ్గా తీసుకునే విషయం ఎంత మాత్రం కాదని, మూలాల్లోకి వెళ్లి ఈ వ్యవహారాన్ని తేలుస్తామని సీజే ధర్మాసనం తేల్చి చెప్పింది. వెకేషన్ కోర్టులో ఏం జరిగిందో తనకు ప్రతిదీ తెలుసని సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. హైకోర్టు రిజిస్ట్రీ తనకు ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని నివేదించిందన్నారు. తనకు ఏమీ తెలియదనుకుంటే అది పెద్ద పొరపాటే అవుతుందని స్పష్టం చేశారు. ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే సొంతమైన అధికారాల విషయంలో తాను నిక్కచ్చిగా వ్యవహరించి తీరుతానన్నారు. ఇదే సమయంలో జీవో 1పై వెకేషన్ బెంచ్ ముందు పిల్ దాఖలు చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీరును సైతం సీజే ధర్మాసనం తప్పుబట్టింది. ఏమంత అత్యవసరం ఉందని హడావుడిగా పిల్ దాఖలు చేశారని రామకృష్ణను నిలదీసింది. మీరేమైనా ధర్నా చేశారా? రాస్తారోకో చేశారా? సమావేశాలు పెట్టారా? ఏం చేస్తే మీకు ఇబ్బంది కలిగింది? అని ధర్మాసనం ప్రశ్నించింది. తక్షణ ఇబ్బంది లేనప్పుడు ఏం మునిగిపోయిందని సెలవుల్లో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారని ప్రశ్నించింది. మధ్యంతర ఉత్తర్వులు పొందిన తరువాత ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా? అంటే అదీ లేదని, ఇలాంటి పిటిషన్ వేసి తీవ్ర గందరగోళ పరిస్థితి సృష్టించారని రామకృష్ణతో పాటు ఆయన తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్‌ను ఉద్దేశించి ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు నుంచి ఉత్తర్వులు పొందేందుకు ఇలాంటి పరిస్థితిని సృష్టించారని, దీనికి సమాధానం చెప్పి తీరాలంది. మీ చర్యలు ప్రధాన న్యాయమూర్తికి బాధ కలిగించాయంది. ఇలాంటి చర్యలు వ్యవస్థకు ఎంత మాత్రం మంచివి కాదంది. జీవో 1పై రామకృష్ణ దాఖలు చేసిన పిల్లో ఇరుపక్షాల వాదనలు ముగియడంతో పాటు ఇదే అంశంపై బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతలు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై మంగళవారం విచారణ జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది. సెలవుల్లో వ్యూహాత్మకంగా పిల్.. రోడ్లు, రోడ్ మార్జిన్లలో బహిరంగ సభల ఏర్పాటును నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న జారీ చేసిన జీవో 1ని సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సంక్రాంతి సెలవుల్లో అత్యవర కేసులను మాత్రమే విచారించే హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు వ్యూహాత్మకంగా పిల్ æ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ దేవానంద్, జస్టిస్ కృపాసాగర్ ధర్మాసనం జీవో 1 అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రామకృష్ణ వ్యాజ్యంపై విచారణ జరపాలని సీజే ధర్మాసనానికి స్పష్టం చేసిన సంగతి విదితమే. సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. ఆ విచక్షణాధికారం వెకేషన్ కోర్టుకుంది... పిటిషనర్ రామకృష్ణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ వాదనలు వినిపిస్తూ వెకేషన్ కోర్టులో ఎలాంటి కేసులను విచారించాలన్న అంశంపై హైకోర్టు రిజిస్ట్రీ నోటిఫికేషన్‌ను చదివి వినిపించారు ఈ నోటిఫికేషన్ ప్రకారం పరిపాలన, విధానపరమైన నిర్ణయాలపై వెకేషన్ కోర్టు విచారణ జరపరాదన్నారు. అయితే ప్రభుత్వ చర్యలు పౌరుల ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉన్నాయని కోర్టు భావించినప్పుడు విచారణ జరిపే విచక్షణాధికారం వెకేషన్ కోర్టుకు ఉందన్నారు. ప్రస్తుత వ్యాజ్యాన్ని కూడా వెకేషన్ కోర్టు అదే తరహాలో భావించి విచారణ జరిపిందని చెప్పారు. ఫలానా తరహా వ్యాజ్యాలను మాత్రమే విచారించాలని నోటిఫికేషన్లో ఉందని, అదే సమయంలో ఫలానా తరహా వ్యాజ్యాలను విచారించకూడదని ఎక్కడా లేదన్నారు. ఈ సమయంలో సీజే స్పందిస్తూ.. సెలవుల్లో ప్రతి కేసునూ ముఖ్యమైనదిగానే భావించి వెకేషన్ కోర్టులు విచారణ జరుపుతూపోతే ఇక వ్యవస్థ ఏం కావాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారం మీరు చెబుతున్నంత సింపుల్ విషయం కాదని స్పష్టం చేశారు. ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే సొంతమైన హక్కులు ఏమిటో తనకు బాగా తెలుసని, వాటి విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించి తీరుతానని, ఇందులో ఎలాంటి సందేహానికి తావు లేదని తేల్చి చెప్పారు. ప్రజలను కలుసుకునే హక్కు పార్టీలకు ఉంది.. అనంతరం రాజు రామచంద్రన్ వాదనలను కొనసాగిస్తూ జీవో 1లోని అంశాలను చదివి వినిపించారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై బహిరంగ సభలను నిషేధించారని పేర్కొన్నారు. సాధారణంగా పాదయాత్రలన్నీ జాతీయ రహదారుల వెంబడే సాగుతాయన్నారు. మునిసిపల్, పంచాయతీ రోడ్లు ఇరుకుగా ఉంటాయని, అక్కడ బహిరంగ సభలకు అనుమతినిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతున్నారన్నారు. అరుదైన, అసాధారణ పరిస్థితుల్లో మాత్రం అనుమతిస్తామని చెబుతున్నారని, అయితే ఆ పరిస్థితులు ఏమిటో నిర్దిష్టంగా చెప్పడం లేదన్నారు. అధికార పార్టీ సభలు నిర్వహించుకునేందుకు ఈ అరుదైన, అసాధారణ పరిస్థితులను కారణంగా చూపి పోలీసులు అనుమతులిస్తారని, ప్రతిపక్షాల విషయంలో భిన్న వైఖరిని అవలంబిస్తారన్నారు. ప్రజలను కలుసుకునే హక్కు రాజకీయ పార్టీలకు ఉందని, దీన్ని జీవో 1 హరిస్తోందన్నారు. రాజకీయ యాత్రలు భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమన్నారు. సభలు, యాత్రలు ఎక్కడ ఎలా నిర్వహించాలన్నది ఆయా పార్టీలు నిర్ణయిస్తాయని, షరతులతో అనుమతులివ్వడం ఇప్పటివరకు జరుగుతూ వచ్చిందన్నారు. మా అభ్యంతరాలను సైతం వెకేషన్ బెంచ్ వినలేదు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ వెకేషన్ కోర్టులో ఏం జరిగిందో ధర్మాసనానికి వివరించారు. పిల్‌ను విచారించే విషయంలో తన అభ్యంతరాన్ని వినేందుకు సైతం వెకేషన్ బెంచ్ నిరాకరించిందన్నారు. సాధారణంగా హౌస్‌మోషన్, లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు కారణాలను స్పష్టంగా వివరిస్తారని, ప్రస్తుత వ్యాజ్యంలో మాత్రం అలాంటిదేం లేదన్నారు. ఈ వ్యాజ్యాన్ని విచారించే రోస్టర్ లేదని చెప్పినా వెకేషన్ బెంచ్ వినిపించుకోలేదన్నారు. సీజే నిర్ణయించిన రోస్టర్‌కు భిన్నంగా వెకేషన్ బెంచ్ మరో రోస్టర్‌ను నిర్ణయించిందన్నారు. వెకేషన్ కోర్టులో సాధారణంగా అత్యవసర కేసులను సీజే అనుమతి తీసుకున్నాకే విచారిస్తారని, ఇది సంప్రదాయంగా వస్తోందన్నారు. పిటిషనర్ బెంచ్ హంటింగ్‌కు పాల్పడ్డారన్నారు. రోడ్‌షోలపై ఎలాంటి నిషేధం లేదు.. రోడ్ షోలు, ఊరేగింపులను జీవో 1 నిషేధించడం లేదని ఏజీ పేర్కొన్నారు. కేవలం రోడ్లపై జరిగే సభలకు మాత్రమే ఆ జీవో వర్తిస్తుందని తెలిపారు. చంద్రబాబు కందుకూరు రోడ్‌పై సభ కారణంగా పలువురు మరణించగా మరికొందరు గాయపడ్డారన్నారు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు చట్ట నిబంధనలను అనుసరించి పోలీసులకు తగిన మార్గనిర్దేశం చేస్తూ జీవో 1 జారీ అయిందన్నారు. నిర్దిష్ట ప్రదేశం లేదా ప్రాంతంలో సభ నిర్వహించుకునేందుకు అనువైన మైదానంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలేవీ ఆచరణ సాధ్యం కాని పరిస్థితులుంటే అలాంటి సమయంలో అసాధారణ పరిస్థితుల కింద అనుతులు ఇస్తామన్నారు. ఊహల ఆధారంగా రామకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్నారు. కందుకూరుతో పాటు గుంటూరులో సైతం తొక్కిసలాట జరిగిందని, ఈ రెండు ఘటనలపై విచారణ కమిషన్‌ను నియమించినట్లు శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రోడ్ షోలు, ఊరేగింపులపై ఎలాంటి నిషేధం లేదని పునరుద్ఘాటించారు. ఈ సమయంలో సీజే జోక్యం చేసుకుంటూ.. రోడ్‌షోలు, ఊరేగింపులపై నిషేధం లేదన్న వాదనను రికార్డ్ చేయమంటారా? అని ప్రశ్నించగా నిస్సందేహంగా రికార్డ్ చేయవచ్చని ఏజీ నివేదించారు. ఈ విషయాన్ని తమ కౌంటర్లో సైతం స్పష్టం చేశామన్నారు. ఏజీ వాదనలు ముగియడంతో రాజు రామచంద్రన్ జోక్యం చేసుకుంటూ జీవో 1 విషయంలో మధ్యంతర ఉత్తర్వుల కోసం అభ్యర్థించారు. ఈ వ్యవహారంలో వాదనలు ఇంకా పూర్తి కాలేదని, మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. జీవో 1పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత కొల్లు రవీంద్ర, పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుల వ్యాజ్యాలపై మంగళవారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. చదవండి: స్వచ్ఛ జల్ సే సురక్ష.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన ఏపీ -
ఏపీ ప్రభుత్వ జీవో నెం.1పై సుప్రీంకోర్టులో విచారణ
-
జీవో నంబర్ 1పై నేడు సుప్రీంకోర్టు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: అమాయక ప్రజలు మృతిచెందకుండా బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలకు నియంత్రణ ఉండేలా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టు గురువారం విచారించనుంది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది మెహ్‌ఫూజ్ నజ్కీ బుధవారం సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ అంశంపై శుక్రవారం హైకోర్టులో విచారణ ఉందని ప్రతివాది రామకృష్ణ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం అత్యవసర విచారణకు అంగీకరించిన సీజేఐ గురువారం జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు. -
జీవో నంబర్ 1 సరైనదే.. జేడీ వీవీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
కంచిలి/కాశీబుగ్గ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 సరైనదేనని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కంచిలిలో విలేకరులతో మాట్లాడారు. రోడ్ల మీద సభలు, రోడ్‌షోలు నిర్వహించే సందర్భాల్లో అనువైన స్థలాలను అంచనా వేసేందుకు పోలీసుల అనుమతిని తప్పనిసరి చేస్తూ అమలు చేస్తున్న జీఓ మంచిదని అన్నారు. ఇటీవల జరిగిన ఘటనల దృష్ట్యా ఈ జీఓను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, దీన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని తెలిపారు. అధికార పార్టీకి ఒక విధంగా, ప్రతిపక్ష, విపక్ష పార్టీలకు ఒక విధంగా అమలు చేయకూడదని సూచించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతోందని, తాను మాత్రం అలా భావించడం లేదన్నారు. ఎన్నికల నియమావళిలో కూడా సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం ముఖ్యమని, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం వంటి చిన్న రాష్ట్రాల డిమాండ్ సరైంది కాదన్నారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్టు ప్రకారం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.జగదీష్ పట్నాయక్, మునకాల కృష్ణమూర్తి, సాహుకారి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పనితీరు భేష్.. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చూస్తుంటే ఆనందంగా ఉందని, ఉద్దానం కిడ్నీ రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేపడుతున్నందుకు ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పద్మనాభపురం వద్ద నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ ఆస్పత్రిని సందర్శించారు. ఇక్కడి కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని, వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఉద్దానంలో ఇంటింటికీ శుద్ధజలం అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించడం గొప్ప పని అన్నారు. ఆయన దత్తత తీసుకున్న సహలాలపుట్టుగను సందర్శించారు. కాగా, మంత్రి సీదిరి అప్పలరాజుతో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. -
జీవో1 అమలు తాత్కాలికంగా నిలుపుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, రోడ్ మార్జిన్లలో సభలు, రోడ్‌షోలను నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న జారీ చేసిన జీవో 1 అమలును హైకోర్టు తాత్కాలికంగా ఈ నెల 23వ తేదీ వరకు నిలిపివేసింది. ఈ జీవో పోలీసు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. జీవో 1ని సవాలు చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కాకు రామకృష్ణ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై గురువారం మధ్యాహ్నం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ జీవో పోలీసు చట్ట నిబంధనలకు విరుద్ధమని రామకృష్ణ తరపు న్యాయవాది అశ్వనీ కుమార్ చెప్పారు. తరువాత అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. 10 రోజుల కిందట ఇచ్చిన జీవోపై ఇప్పుడు ఈ వెకేషన్ బెంచ్ విచారణ జరిపేందుకు వీలుగా ఈ వ్యాజ్యం దాఖలు చేశారని తెలిపారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలపై విచారణ జరిపే పరిధి వెకేషన్ కోర్టుకు లేదన్నారు. సభలు, రోడ్‌షోల కోసం ఏ పార్టీ దరఖాస్తు చేయడం గానీ, తాము అనుమతులు నిరాకరించడం గానీ జరగలేదన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ స్పందిస్తూ.. ‘పోలీసు చట్టం 1861 అమల్లోకి తెచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇలాంటి జీవో తెచ్చి ఉంటే స్వాతంత్య్రోద్యమం జరిగేదా? స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి జీవో రాలేదు. ఈ వ్యాజ్యం విచారణకు రాకుండా చేసేందుకు తెర వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు. హైకోర్టు వ్యవహారాలను థర్డ్‌పార్టీ నడిపిస్తోంది.’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ఏజీ వాదనలను కొనసాగిస్తూ.. జీవోలో నిషేధం అన్న పదమే లేదని తెలిపారు. నెల్లూరు, గుంటూరుల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే పోలీసులకు పలు సూచనలు చేస్తూ జీవో 1 జారీ చేశామన్నారు. సభలు, రోడ్‌షోల నిషేధానికి కాదని చెప్పారు. -
జీవో నెంబర్ 1పై దుష్ప్రచారం.. ఏపీ అడిషనల్ డీజీపీ క్లారిటీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై జరగుతున్న దుష్ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ రవి శంకర్ అయ్యన్నార్ వివరణ ఇచ్చారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 1861 పోలీస్ యాక్ట్‌కు లోబడే జీవో నెంబర్ 1 విడుదల చేసినట్లు పేర్కొన్నారు. షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఇస్తామన్నారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదన్నారు. బ్యాన్ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇటీవల ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ జీవో తీసుకొచ్చినట్లు ఏడీజీపీ రవి శంకర్ తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభలు నిర్వహించుకోవాలని సూచించారు. పోలీసులు వేదిక స్థలాన్ని పరిశీలించి అనుమతి ఇస్తారని తెలిపారు. రహదారులు, రోడ్లపై సభలకు అనుమతి లేదన్నారు. అదికూడా అత్యవసరమైతే అనుమతులతో నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ఈ జీవో ఉద్దేశం నిషేధం కాదని స్పష్టం చేశారు. ప్రజల రక్షణ, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని జీవో నెంబర్1ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత చట్టం దేశ వ్యాప్తంగా అమలవుతున్నదేనని అన్నారు. అందుకే వద్దన్నాం ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రహదారుల మీద సభలు వద్దన్నామని లా అండ్ ఆర్డర్ డీఐజీ రాజశేఖర్ తెలిపారు. మరీ అత్యవసర పరిస్థితుల్లో అనుమతులు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సన్నగా, ఇరుగ్గా ఉండే రోడ్లమీద సభల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది ఏర్పుడుతుందని.. అంబులెన్సులు, విమాన ప్రయాణాల వారికి సమస్యలు తేవద్దని సూచించారు. అందువల్లే పబ్లిక్ గ్రౌండ్లలో సభలు జరుపుకోవాలని జీవోలో ఉందని పేర్కొన్నారు. చదవండి: మాజీ మంత్రి నారాయణ కంపెనీలపై ఏపీ సీఐడీ సోదాలు -
ప్రజల పట్ల అందరూ బాధ్యతగా ఉండాల్సిందే: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: జీవో నంబర్ వన్‌పై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు ముందు దాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. పదేపదే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు అసలు ఆ జీవోను ఇప్పటిదాకా చదివాయా అంటూ ప్రశ్నించారు. అందులో రోడ్‌షోలు, ర్యాలీలు నిషేధమని ఎక్కడుందో చెప్పాలని కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై బహిరంగ సభలు పెట్టొద్దని మాత్రమే చెప్పాం. అవసరమైతే అనుమతి తీసుకొని బహిరంగ సభలు పెట్టుకోవచ్చు. జోవో నంబర్ వన్ అన్ని పార్టీలకు వర్తిస్తుంది. వైఎస్సార్, జగన్ పాదయాత్రల్లో ఎంతో జాగ్రత్త తీసుకున్నాం. కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. ప్రజల పట్ల అందరూ బాధ్యతగా ఉండాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..) -
పింఛన్లు రెగ్యులర్‌గా ఇవ్వాలి
మెదక్ మున్సిపాలిటీ : వికలాంగులకు ప్రతినెల పింఛన్లు రెగ్యులర్‌గా ఇవ్వాలని, జీఓ నెం.01 అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని వికలాంగుల హక్కుల వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర కార్యదర్శి ఎం. అడివయ్య పేర్కొన్నారు. వికలాంగుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరెట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మొత్తం 20వేల మంది వికలాంగులున్నారని, అందులో 11,656 మందికి మాత్రమే పింఛన్లు వస్తున్నాయన్నారు. మిగతా వారికి సదరం సర్టిఫికెట్లు లేకపోవడంతో పింఛన్లు అందడం లేదన్నారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు అందజేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అలాగే ప్రభుత్వ పథకాల్లో సరైన న్యాయం జరగడం లేదన్నారు. డబుల్బెడ్రూంలు, బస్‌పాస్‌లు, అంత్యోదయకార్డులు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ వంటి వాటిని పరిష్కరించడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామన్నారు. అనంతరం జేసీ నగేశ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. వీరి ధర్నాకు మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. వికలాంగుల సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరికి లేఖరాసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు యశోధ, జిల్లా నాయకులు ముత్యాలు, కవిత, విజయ్‌కుమార్, దుర్గ, బస్వరాజ్, శ్రీనివాస్, కృష్ణ, భిక్షపతి, చంద్రం, రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాకార్యదర్శి మల్లేశం వికలాంగులు పాల్గొన్నారు. -
అన్నిటికీ.. ఓకే..!
నల్లగొండ: జిల్లా వ్యాప్తంగా అమతిలేని ప్రైవేటు పాఠశాలు అసలే లేవట...! ప్రస్తుతం కొనసాగుతున్న స్కూళ్లన్నింటికీ గుర్తింపు ఉందట...! జీఓ నంబర్ ఒకటి ప్రకారం అన్ని స్కూళ్లలో అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయట.. సమస్యలు ఉన్న ప్రైవేటు స్కూలు ఒక్కటీ లేదంట...! ఇవీ మండల విద్యాధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి నిర్ధారించిన అంశాలు. అసలు జీఓ నంబర్ 1లో ఏముందో తెలుసుకున్నారో లేదో గానీ...ఎంఈఓలు మాత్రం ప్రైవేటు పాఠశాలలకు బాసటగా నిలిచారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేసి గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు...అట్టి జాబితాను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపాల్సిందిగా ఎంఈఓలకు గత నెలలో నిర్వహించిన సమావేశంలో అధికారులు సూచించారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి జాబితా కూడా డీఈఓ కార్యాలయానికి చేరలేదు. దీంతో జిల్లాలో గుర్తింపు లేని స్కూళ్లు లేవన్న నిర్ధారణకు జిల్లా విద్యాశాఖ అధికారి వచ్చేశారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ...ఈ టెక్నో, టెక్నో, ఒలంపియాడ్, ఇంటర్నేషనల్, ప్లే స్కూల్, ఐఐటీ, కాన్సెప్ట్ పేర్లతో కొనసాగుతున్న స్కూళ్లకు పేర్లు మార్చుకోవాలని నోటీసులు జారీ చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆదేశాలు బేఖాతర్.. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతి (గుర్తింపు) లేకుండా కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలను గుర్తించి ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. జీఓ నంబర్ ఒకటి ప్రకారం అన్ని వసతులు ఉన్నాయో...లేవో...పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. అయినా ఇంత వరకు ఏ ఒక్క మండలం నుంచి నివేదికలు డీఈఓకు అందలేదు. ఇంతవరకు ఏ ఒక్క పాఠశాలకు నోటీసులు జారీ చేయలేదు. ప్రస్తుతం జిల్లాలో 1400 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిల్లో గతేడాది లెక్కల ప్రకారం 30 పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయని గుర్తించారు. కానీ ఇప్పుడు ఆ పాఠశాలలు అనుమతి తీసుకున్నాయా...! లేదా.. ? అనే సమాచారం కూడా విద్యాశాఖ వద్ద లేదు. అనుమతి పొంది కొనసాగుతున్న పాఠశాలల్లో కనీస వసతులు కూడా కరువయ్యాయి. పంపకాల పంచాయితీ.. ప్రైవేటు పాఠశాలలకు 1 నుంచి 7 తరగతి వరకు ఎంఈఓలు, 6 నుంచి 10 తరగతి వరకు డిప్యూటీ డీఈఓల ఆమోదంతో డీఈఓ కార్యాలయానికి పంపాలి. సీజ్ చేసిన పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం, కొత్త పాఠశాలలకు అనుమతులు మంజూరు చేయడంలో వేల రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పాఠశాలకు రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు ముట్టచెప్పిందే పనిజరగడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కింది నుంచి పై స్థాయి వరకు ఒక్కో రేటు ఫిక్స్ చేసుకుని మరీ వసూళ్లకు పాల్పప డుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని జీర్ణించుకోలేని కొందరు ఉద్యోగులు ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలతో వీధికెక్కారు. మూడు డివిజన్లకు రెగ్యులర్ డిప్యూటీ డీఈఓలు లేకపోవడం, 58 మండలాల్లో ఇన్చార్జి ఎంఈఓలే ఉండటంతో స్కూళ్ల అనుమతులు జారీ చేయడలో పెత్తనమంతా విద్యాశాఖదే అయింది. మొక్కుబడి తనిఖీలు... అనుమతి లేని పాఠశాలలు ప్రచారం చేస్తున్నాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే గానీ స్వతహాగా అధికారులు స్పందించడం లేదు. దామరచర్ల, కోదాడ, నాగార్జునసాగర్, చండూరు మండలాల్లో గుర్తింపు లేని పాఠశాలలు అడ్మిషన్లు తీసుకుంటున్నాయని ఫిర్యాదు చేయడంతో వాటిని అధికారులు సీజ్ చేశారు. వసతుల విషయానికొస్తే.. సరిపడా తరగతి గదులు, భవన నిర్మాణ నాణ్యత ధ్రువీకరణ పత్రం, ఆటస్థలం, లైబ్రరీ, ప్రహరీ, అగ్నిమాపక శాఖ జారీ చేసిన నోఆబ్జెక్షన్ సర్టిఫికెట్, తాగునీటి వసతి, ప్రథమ చికిత్స, కంప్యూటర్ గది, సిబ్బంది గదులు, విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేకంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు కచ్చితంగా ఉండాలి. ఆ పాఠశాలలకే అనుమతి ఇవ్వాలని జీఓ నంబర్ 1 చెబుతోంది. దీంతో పాటు స్కూల్ భవనం ఒకటికి మించి పై అంతస్తులు ఉంటే గ్రిల్స్ ఏర్పాటు చేశారా..? లేదా..?అని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. జీఓ ఎం.ఎస్ నం.1, సెక్షన్ (1) 82 ప్రకారం అనుమతి లేకుండా విద్యాసంస్థల ప్రారంభం, ప్రచారం నేరం. విద్యాహక్కు చట్టం మేరకైతే అనుమతిలేని పాఠశాలలు ప్రచారం చేసినా, నిర్వహించినా కనీసం ఆరు నెలల జైలు శిక్ష, లక్ష రూపాయాల వరకు జరిమానా విధించాలి. కానీ జిల్లాలో ఈ స్థాయిలో ఇప్పటి వరకు సీజ్ చేసిన పాఠశాలల పై ఆ విధమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అనుమతి లేని పాఠశాలలు లేవు : విశ్వనాథరావు, డీఈఓ జిల్లాలో అనుమతి (గుర్తింపు) లేని ప్రైవేటు పాఠశాలలు లేవు. అలా ఏమైనా ఉంటే వాటిపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. పాఠశాలల్లో అన్ని రకాల వసతులను పరిశీలించి రిపోర్ట్ పంపాల్సిన బాధ్యత ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓల పైనే ఉంది. డీఈఓ కార్యాలయంలో స్కూళ్ల అనుమతికి లంచాలు తీసుకుంటున్నారనే విషయం నా దృష్టికి రాలేదు. అలా ఎవరైనా ప్రవ ర్తించినట్లు నాకు ఫిర్యాదు చేసినట్లయితే వారి పై తక్షణ మే చర్య తీసుకుంటాం.