
సాక్షి, న్యూఢిల్లీ: అమాయక ప్రజలు మృతిచెందకుండా బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలకు నియంత్రణ ఉండేలా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టు గురువారం విచారించనుంది.
హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది మెహ్ఫూజ్ నజ్కీ బుధవారం సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ అంశంపై శుక్రవారం హైకోర్టులో విచారణ ఉందని ప్రతివాది రామకృష్ణ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం అత్యవసర విచారణకు అంగీకరించిన సీజేఐ గురువారం జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment