ఖాతాలో జమ.. అంతా మమ | money problems | Sakshi
Sakshi News home page

ఖాతాలో జమ.. అంతా మమ

Published Fri, Dec 2 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

ఖాతాలో జమ.. అంతా మమ

ఖాతాలో జమ.. అంతా మమ

  • 1.25 లక్షల మంది వేతన జీవులు, పింఛ¯ŒSదారుల ఇక్కట్లు
  • రూ.1000 ఇస్తాం కానీ మరో వెయ్యి ఇస్తేనే రూ.2000. పింఛన్‌దారులకు బ్యాంకర్ల మెలిక 
  • 60 శాతం ఏటీఎంల తలుపులు మూతే
  • కొత్తపేట ఎస్‌.బి.ఐ.లో రూ.500లే గతి
  • ర్యాలి ఆంధ్రాబ్యాంకు ఎదుట ధర్నా 
  • నిర్దిష్ట తేదీ ప్రకటించకుండా పింఛన్లిస్తామని దండోరాలు  
  •  
    పరిస్థితిదీ...
    జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, రిటైర్డ్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు లక్షా 25 వేలు పైనే ఉన్నారు. వీరందరికీ జీతాల బడ్జెట్‌ రూ.500 కోట్లు.  కానీ బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లో నిలబడినా నాలుగు వేలు మించి చేతికి రాని వైనం.
    761 బ్రాంచీల పరిధిలో 931 ఏటీఎంల ద్వారా రూ.5.30 కోట్లు మాత్రమే డ్రా అయింది. మధ్యాహ్నం తరువాత సుమారు 560  ఏటీఎంలలో నోక్యాష్‌ బోర్డులు కనిపించాయి. రూ.1000 డిపాజిట్‌ చేస్తే రూ.2000 నోటు ఇస్తామని రాజమండ్రి రూరల్‌లో బ్యాంకు సిబ్బంది రూ.1000 వృద్ధాప్య పింఛ¯ŒSదారుల జీవితాలతో ఆటలాడుకున్నారు.
     
    సాక్షిప్రతినిధి, కాకినాడ :
    డబ్బు లేదు. డబ్బు లేదు. డబ్బు లేదు..ఎక్కడ చూసినా...ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నా ఇదే అంశం. జీతాలు ఖాతాలో పడ్డాయనే ఆశ క్షణాల్లో ఆవిరైపోతుంటే ఆగ్రహం కట్టలు తెంచుకునే పరిస్థితి జిల్లా అంతటా నెలకుంది. జీతం పడింది ... నెల అవసరాలకు డబ్బులు తీసుకుందామని  శుక్రవారం బ్యాంకులకు వెళ్లేసరికి ఐదారు వేలు చేతిలో పెట్టి ‘మమ’ అనిపించి బ్యాంకర్లు చేతులు దులుపుకోవడంతో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక పింఛ¯ŒSదారులనే  కనికరం లేకుండా మొండి చేయి చూపిస్తున్నారు.  రాజమహేంద్రవరం రూరల్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో అయితే సామాజిక పింఛ¯ŒS రూ.1000 ఇస్తాం, కానీ మరో రూ.1000 జమ చేస్తే రెండు వేలు నోటు ఇస్తామని పింఛ¯ŒSదారులకు బ్యాంకులు మెలికి పెట్టాయి. ఆ వచ్చే కొద్దిపాటి పింఛ¯ŒSతోనే పొట్టపోసుకునే తమబోటి వాళ్లు మరో వెయ్యి ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వగలమంటూ పింఛ¯ŒSదారులు బ్యాంకు అధికారులపై మండిపడటం కనిపించింది. రెండో తేదీ శుక్రవారం కూడా జీతాలు, పింఛన్ల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల వద్ద పడిగాపులుపడ్డా పట్టుమని ఐదు వేలు కూడా చేతికి చిక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.  
    రూ.500లే గతి...
    గురువారం రూ.4 వేలు చెల్లించిన కొత్తపేట ఎస్‌.బి.ఐ. బ్రాంచిలో శుక్రవారం రూ.500 చేతిలో పెట్టి ఇవ్వలేమని చేతులెత్తేశారు. ఆత్రేయపురం మండలం ర్యాలి ఆంధ్రాబ్యాంక్‌ విధులు ప్రారంభమైన అరగంటకే నో క్యాష్‌ బోర్డు పెట్టడంతో ప్రజలు ధర్నాకు  దిగారు. రూ.1000 డిపాజిట్‌ చేస్తే రూ,2000 నోటు ఇస్తామని రాజమండ్రి రూరల్‌లో బ్యాంకు సిబ్బంది వృద్ధాప్య పింఛ¯ŒSదారుల జీవితాలతో ఆటలాడుకున్నారు.రామచంద్రపురం, కాకినాడ సిటీ, మండపేట, రాజోలు నియోజకవర్గాల్లో ఉదయం 10 గంటల నుంచీ ఏటీంలలో నగదు లేదనే బోర్డులు దర్శనమిచ్చాయి. జగ్గంపేట, పి గన్నవరం, పెద్దాపురం, ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాల్లో సామాజిక పింఛన్లు అందకపోవడంతో బ్యాంకుల చుట్టూ దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు కాళ్లరిగేలా తిరిగారు.
    ఆటోలకు రూ.20 చార్జీలు చెల్లించి బ్యాంకులకు వద్దకు వచ్చి పడిగాపులు పడి తీరా ఇవ్వడం లేదని చెప్పడంతో కంటతడి పెట్టుకుంటూ వెళ్లిపోయారు. కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్, పంచాయతీ అధికారులు పింఛన్లు ఇచ్చే తేదీన ప్రకటిస్తామని దండోరా వేయించారే తప్ప ఎప్పుడు ఇస్తామనేది ప్రకటించలేదు. రాజమండ్రి నగరంలో సేవింగ్‌ ఖాతాదారులకు రూ.4వేలు, కరెంటు ఖాతాదారులకు రూ.10 వేలు ఇచ్చారు. సగానికి పైగా ఏటీఎంలు మూతేశారు. రాజానగరం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లోని బ్యాంకుల్లో రూ.4 వేలు, రూ.6 వేలు మాత్రమే ఇచ్చారు. మధ్యాహ్నం తరువాత ఏటీఎంలో నగదు లేదంటూ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏటీఎంలు పని చేయలేదు. మోతుగూడెంలో ఆంధ్రాబ్యాంకులో డబ్బులు లేకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఇలా ఎన్ని రోజులు బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటారో తెలియడం లేదని, ఉద్యోగాలు మానేసి బ్యాంకుల చుట్టూ నెలంతా తిరిగినా జీతం మొత్తం చేతికొస్తుందనే గ్యారెంటీ లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    24 రోజులుగా బ్యాంకుల్లో నెలకొన్న పరిస్థితి వేరు, గడచిన రెండు రోజులుగా ఉత్పన్నమైన పరిస్థితులు వేరుగా ఉన్నాయి.  పెద్ద నోట్లు రద్దుచేసిన దగ్గర నుంచి ఇంతవరకు జిల్లాలో ప్రజలు డిపాజిట్లు చేసింది రూ.3,800 కోట్లు. రిజర్వు బ్యాంకు జిల్లాకు ఇచ్చింది రూ.1200 కోట్లు. వీటిలో రూ.410 కోట్లు ఆంధ్రాబ్యాంకు ఎక్కువగా మారకం చేసింది. శుక్రవారం రాత్రికి రూ.140 కోట్లు రానుంది. మరో రూ.600 కోట్లు ప్రతిపాదనలున్నాయి. అయినా సరే అవసరాలు తీర్చలేని పరిస్థితి కనిపిస్తోంది.
     
    నో క్యాష్‌తో కష్టాలు...
    జిలా ్లవ్యాప్తంగా ఉద్యోగులు, రిటైర్డ్,  ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు లక్షా 25 వేల పైచిలుకుగానే ఉన్నారు. వీరందరికీ జీతాల బడ్జెట్‌ రూ.500 కోట్లు. కానీ బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లోల నిలబడినా నాలుగు వేలు మించి చేతికి రాని వైనం. ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు ఎవరికైనా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలో నాలుగు వేలు మించి ఇవ్వలేదు, రంపచోడవరం ఏజెన్సీలో మాత్రం రిటైర్డ్‌ ఉద్యోగులకు రూ.6000 వంతున ఇచ్చారు. రూ.35,000 జీతగాడికి నాలుగైదు వేలు చేతిలో పెట్టడంతో ‘ఇది ఏ మూలకు వస్తుంద’ని ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. బ్యాంకుల్లో నగదు ఉదయానికే నిండుకోవడంతో నిలువుకాళ్ల జపం చేసినా అరకొరగానే అందడంతో ఈసురోమంటూ తిరిగి వెళ్లిపోయారు. మొత్తం జీతం నాలుగైదు దఫాలుగా డ్రా చేయాలంటే  నెలంతా తిరగాల్సిందేననని, ఇదేమి శిక్షంటూ వాపోతున్నారు. పోనీ ఏటీఎంల వద్ద తీసుకుందామంటే విత్‌డ్రా పరిమితి రూ.2 వేలే. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 60 శాతం ఏటీఎంలు నగదు లేదనే బోర్డులతోనే దర్శనమిచ్చాయి. 761 బ్రాంచీల పరిధిలో 931 ఏటీఎంల ద్వారా రూ.5.30 కోట్లు మాత్రమే డ్రా అయింది. మధ్యాహ్నం తరువాత సుమారు 560  ఏటీఎంలలో నోక్యాష్‌ బోర్డులతో కనిపించాయి. 761 బ్యాంక్‌ బ్రాంచిలలో నగదు మార్పిడితో పాటు విత్‌డ్రాలు రూ.60 కోట్లయ్యాయి. శని, ఆదివారాల్లో జిల్లాలో అవసరాలు తీరాలంటే రూ.500 కోట్లు అవసరం. ఈ మేరకు రిజర్వు బ్యాంకుకు ప్రతిపాదనలు పంపించారు. అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement