కరెన్సీ...కట్..కట!
కనికరించని బ్యాంకర్లు.. తెరచుకోని ఏటీఎంలు
యథావిధిగా జనం వెతలు
క్యూలలోనే పెన్షనర్లు.. ఉద్యోగులు
సిటీబ్యూరో : ఆబిడ్‌స...చార్మినార్...సికింద్రాబాద్...మాదాపూర్..కూకట్‌పల్లి..ఎల్బీనగర్...రాజేంద్రనగర్...బంజారాహిల్స్..ప్రాంతమేదైనా రెండోరోజూ అదే సీన్. బ్యాంకుల ముందు భారీ క్యూలు. అరకొర నగదుతో సరిపెట్టిన బ్యాంకులు..తెరచుకోని ఏటీఎంలు...నగరవాసికి తప్పని కరెన్సీ ఇక్కట్లు. శుక్రవారం కూడా గ్రేటర్ వ్యాప్తంగా ఇదే దుస్థితి. ఎడారిలో ఒయాసిస్సులా ఎక్కడో ఓ చోట ఏటీఎం తెరచుకున్నప్పటికీ అక్కడి లైన్లు చూస్తే సొమ్మసిల్లి పడిపోయే దుస్థితి. గంటల తరబడి క్యూలో నిల్చున్నా తీరా మావంతు వచ్చే సరికి నగదు నిల్వలు నిండుకున్న దుస్థితి ఎదురైందని పలువురు సిటీజన్ల ఆక్రోశం. అత్యవసర చికిత్సలు, ప్రాణాధార మందుల కొనుగోలుకూ చేతిలోచిల్లి గవ్వ లేదని పెన్షనర్ల ఆందోళన. ఇంటి అద్దె, పాలబిల్లు, పిల్లల ట్యూషన్ ఫీజులు, నిత్యావసరాలుఎలా కొనుగోలు చేయాలో తెలియడంలేదని సగటు వేతన జీవి ఆవేదన.
ఇదీ నగరంలో సర్వత్రా కనిపించిన దుస్థితి. మహానగరం పరిధిలోని 1435 బ్యాంకులుండగా..శుక్రవారం పలు బ్యాంకుల్లో సేవింగ్‌స ఖాతా వినియోగదారులకు రూ.2 నుంచి రూ.4 వేల నగదు ఉపసంహరణకే అనుమతించారుు. పలు బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో మధ్యాహ్నానికే మూతపడ్డారుు. నగదు ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పలేమంటూ బ్యాంకర్లు చేతులెత్తేయడంతో జనం అవస్థలు వర్ణనాతీతంగా మారారుు. ఏటీఎంలలో వస్తున్న రూ.2 వేల నోట్ల మార్పిడికీ అష్టకష్టాలు పడాల్సి వస్తోందని జనం ఆవేదన వ్యక్తంచేశారు. వెరుు్యకి పైగా బిల్లు చేస్తేనే చిల్లర ఇస్తామంటూ వ్యాపారులు చుక్కలు చూపుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. గ్రేటర్ పరిధిలోని ఏడువేల ఏటీఎం కేంద్రాలుండగా..తెరచుకున్నవి రెండు వేలలోపు మాత్రమే కావడం గమనార్హం. పెట్రోల్ బంకుల్లోనూ పాత రూ.500 నోట్ల స్వీకరణకు స్వస్తి పలకడంతో బండి నడిచేదెలాగో అర్ధంకాని పరిస్థితి నెలకొందని పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. కాగా నగరంలోని ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆస్పత్రి పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఏటీఎంల వద్ద రోగుల బంధువులు, సహాయకులు నగదు కోసం గంటలతరబడి క్యూలైన్లలో నిల్చున్పటికీ ఫలితం లేదని వాపోయారు.
కుదేలైన చిరువ్యాపారులు...
పెద్ద నోట్ల రద్దు గ్రేటర్‌లో చిరు వ్యాపారుల్ని చిదిమేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి ఉపాధిపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. నోట్ల రద్దుకు ముందు కళకళలాడిన వ్యాపారాలు నేడు జనం లేక బోసిపోరుు కనిపిస్తున్నారుు. పెద్ద నోట్లు రద్దు చేసి 23 రోజులు గడుస్తున్నా.. ఇంకా చిల్లర కష్టాలు జనాన్ని వెంటాడుతుండడంతో చిరువ్యాపారుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంటోంది. పెద్ద నోట్లు తీసుకువస్తే వాటిని తీసుకోలేని పరిస్థితి...దీంతో వ్యాపార లావాదేవీలన్నీ స్తంభించిపోయారుు. ఈ 23 రోజుల్లో 50 శాతం నుంచి 70 శాతం అమ్మకాలు పడిపోవడంతో చిరువ్యాపారుల కుటుంబాలు చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కళ తప్పిన మార్కెట్లు...
గ్రేటర్ పరిధిలోని బేగంబజార్, చార్మినార్, ఆబిడ్‌స, బషీర్‌బాగ్, జనరల్‌బజార్, సుల్తాన్‌బజార్ వంటి మార్కెట్లన్నీ కరెన్సీ కష్టాల కారణంగా కళతప్పారుు. గత 20 రోజులుగా తమ వ్యాపారాలు 50 శాతానికి పైగా పడిపోయాయని, దుకాణాల అద్దెలు, పనివాళ్ల వేతనాలు, కరెంట్ బిల్లులు ఇతరత్రా నిర్వహణ వ్యయాలకు నగదు ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకావడం లేదని పలువురు వ్యాపారులు వాపోయారు.