కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యం( డీఏ) పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించే డియర్ నెస్ అలవెన్స్‌ను అదనంగా 2 శాతం పెంచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జరిగిన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జనవరి 2017 నుంచి ఈ డీఏ/డీఆర్ 2 శాతం పెంపును అమలు చేయనున్నారు. డీఏ పెంపు వల్ల 50 లక్షల మంది ఉద్యోగులతో పాటు 58 లక్షల మంది పింఛన్ దారులు లబ్ది పొందనున్నారు.
కాగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా డీఏ పెంపు లేదని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. నిత్యా వసరాలు ఆకాశాన్నం టుతుంటే కేంద్రం తక్కు వగా పెంచుతోందని కేంద్ర ఉద్యోగుల సమాఖ్య ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే.