పెన్షనర్లకు ఎస్‌బీఐ శుభవార్త! | State Bank of India launches Pension Seva for senior citizens | Sakshi
Sakshi News home page

పెన్షనర్లకు ఎస్‌బీఐ శుభవార్త!

Published Mon, Sep 13 2021 9:03 PM | Last Updated on Mon, Sep 13 2021 9:07 PM

State Bank of India launches Pension Seva for senior citizens - Sakshi

సీనియర్ సీటిజన్ ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సీనియర్ సీటిజన్ ఖాతాదారుల కోసం ప్రత్యేక కొత్త పెన్షన్ సేవలను ప్రవేశపెట్టింది. పెన్షన్ తీసుకునే వారి కోసం ప్రత్యేకంగా  ఒక పోర్టల్(https://www.pensionseva.sbi) తీసుకొనివచ్చింది. ఈ పోర్టల్ ద్వారా సీనియర్ సీటిజన్ ఖాతాదారులు అన్ని రకాల పెన్షన్ సర్వీసులను యాక్సెస్ చేసుకోవచ్చు. ముందుగా అవసరమైన సమాచారం అందించి, పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత సేవలు సులభంగా పొందొచ్చని ఎస్‌బీఐ వివరించింది.(చదవండి: ఈ 4 యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి!)

పోర్టల్ ద్వారా ఏ ఏ సేవలు పొందొచ్చంటే..

  • బకాయిల లెక్కింపు షీట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
  • పెన్షన్ స్లిప్ లేదా ఫారం-16ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
  • పెన్షన్ లాభం వివరాల సమాచారాన్ని చూడవచ్చు. 
  • మీ పెట్టుబడులను తనిఖీ చేయవచ్చు. 
  • లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ చూసుకోవచ్చు.

ఇక మీ ఫోన్లో పెన్షన్ చెల్లింపు వివరాలకు సంబంధించి అలర్ట్లు వస్తాయి. అలాగే లైఫ్ సర్టిఫికేషన్ సదుపాయం మీ దగ్గరల్లో ఉన్న బ్రాంచీవద్ద లభిస్తుంది. మీ ఈ-మెయిల్ కు పెన్షన్ స్లిప్ వస్తుంది. ఇకపోతే మీ పేరు పోర్టల్‌లో రిజిస్టర్ చేసిన తర్వాత ఏదైనా సమస్యలు వస్తే దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు support.pensionseva@sbi.co.inకు ఈ-మెయిల్ చేయవచ్చు. అలాగే 'ఎస్ఎమ్ఎస్ అన్ హ్యాపీ' టైప్ చేసి 8008202020కు ఎస్ఎమ్ఎస్ చేయవచ్చు లేదా 18004253800/1800112211 లేదా 08026599990 కాల్ చేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement