
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కారు ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించకుండా బకాయిపెట్టిన రెండు డీఏలను చెల్లించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు డీఏ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఏకంగా రూ.2,400 కోట్లకుపైనే భరించనుంది. ఈ రెండు డీఏల 30 నెలల తాలూకు బకాయిలు చెల్లించేందుకు రూ.6,034.80 కోట్ల మేర వ్యయం కానుంది. 2018 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లించకుండా చంద్రబాబు సర్కారు బకాయి పెట్టింది. 2019 జనవరి నుంచి మరో డీఏను కూడా చంద్రబాబు సర్కారు బకాయి పెట్టింది. ఈ రెండు బకాయిలను చెల్లించడంతో పాటు 2019 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏను కూడా చెల్లించేందుకు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.2,011 కోట్లను భరించనుంది. 30 నెలల బకాయిలకు రూ.5,028.90 కోట్లు వ్యయం కానుంది.
పెన్షనర్లకు....
► పెన్షనర్లకు 3.144 శాతం పెంపు జూలై 2018 నుంచి వర్తింపు, జనవరి 2021 నుంచి చెల్లింపు
► 2019 జనవరి నుంచి మరో 3.144 శాతం డీఏ పెంపు వర్తింపు, 2021 జూలై నుంచి చెల్లింపు
► 2019 జూలై నుంచి మరో 5.24 శాతం డీఏ పెంపు, జనవరి 2022 నుంచి చెల్లింపు
ఉద్యోగులకు...
► ఉద్యోగులకు జూలై 2018 నుంచి 3.144 శాతం డీఏ పెంపు, 2021 జనవరి నుంచి చెల్లింపు
► 2019 జనవరి నుంచి 3.144 శాతం పెంచిన డీఏ జూలై 2021 నుంచి చెల్లింపు
► 2019 జూలై నుంచి పెంచిన 5.24 శాతం డీఏ జనవరి 2022 నుంచి చెల్లింపు
Comments
Please login to add a commentAdd a comment